ప్రియాంకకు కరోనా.. రాహుల్‌కు సమన్లు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంకకు కరోనా.. రాహుల్‌కు సమన్లు

June 3, 2022

కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియా గాంధీకి కరోనా సోకిన మరుసటి రోజే ఆమె కుమార్తె ప్రియాంక గాంధీకి కూడా కోవిడ్ సోకింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆమె ట్వీట్ చేశారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ గా తేలిందన్నారు. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని ప్రియాంక పేర్కొన్నారు. తనను కలిసిన వారు, పరిచయం ఉన్నవారు కూడా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

మరోవైపు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రత్యేకంగా రాహుల్ గాంధీకే ఈ నోటీసులు జారీ చేసిన ఈడీ.. జూన్ 13వ తేదీన విచారణాధికారుల ఎదుట హాజరవ్వాల్సిందిగా పేర్కొన్నారు.