నాకూ ఆడబిడ్డలున్నారు.. నా కొడుకును ఏమైనా చేసుకోండి: చెన్నకేశవులు తల్లి - MicTv.in - Telugu News
mictv telugu

నాకూ ఆడబిడ్డలున్నారు.. నా కొడుకును ఏమైనా చేసుకోండి: చెన్నకేశవులు తల్లి

November 30, 2019

kesavulu-mother.

 

ప్రియాంకపై పాశవికంగా ప్రవర్తించిన నిందితులకు ఇంటా, బయట వ్యతిరేకతే వ్యక్తం అవుతోంది. సభ్య సమాజం సిగ్గుపడేలా చేసిన ఈ ఘటనపై అంతా మండిపడుతున్నారు. ఇంత పెద్ద తప్పు చేసిన తన కొడుకును ఏం చేసినా అడ్డుపడమని చెన్నకేశవులు తల్లి చెబుతోంది. అమ్మాయిని చిత్రహింసలు పెట్టి చంపినట్టుగా తన కొడుకును ఉరితీసినా కాల్చిపడేసినా పర్వాలేదని జయమ్మ చెప్పుకొచ్చింది. ఇప్పటికే షాద్‌నగర్ బార్ అసోషియేషన్ వాళ్ల తరుపున కేసు వాదించకూడదని నిర్ణయించింది. 

ఈ ఘటనపై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేసింది.‘నా కొడుకు మంచివాడే. కానీ ఇలా చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. ప్రేమ పెళ్లి చేసుకున్నా అడ్డుచెప్పలేదు. స్నేహితులతో తిరగడం వల్లే వాడు అలా తయారయ్యాడు. మహ్మద్‌ ఆరిఫ్  స్నేహం నా కొడుకును పాడుచేసింది. ఎప్పుడూ వచ్చి లారీ పనికి తీసుకెళ్లేవాడు.నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఆ తల్లి కడుపు కోత నేరు అర్ధం చేసుకోగలను. ఇంతటి దారుణం చేసిన నా కొడుకునే ఇప్పుడు వెనకేసుకు రాలేను. ఆడబిడ్డల తల్లిగా నేను చెబుతున్నది ఒక్కటి. వాన్ని ఏం చేసినా పర్వాలేదు’ అని ఆవేదన వ్యక్త చేసింది. ఇప్పటికే నిందితులను ఉరి తీయాలంటూ అన్ని వర్గాల నుంచి డిమాండ్లు  వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తి మారాయి.