ప్రియాంక హంతకులకు 14 రోజుల రిమాండ్..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంక హంతకులకు 14 రోజుల రిమాండ్.. 

November 30, 2019

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యకేసులో నిందితులైన నలుగురిని ఉరి తీయాలంటూ షాద్ నగర్ ప్రజలు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. పోలీసులు లాఠీచార్జీతో చెదరగొడుతున్నా భయపడకుండా అక్కడే ఆందోళనకు దిగారు. దీంతో స్టేషన్ లోపల ఉన్న నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టలేకపోయారు. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పాండు నాయక్ స్వయంగా ఠాణాకు చేరుకుని నిందితుల నేరాను విచారించి వారికి 14 రోజుల రిమాండు విధించారు. అంతకు ముందు వైద్యులు అక్కడే వారికి వైద్యపరీక్షలు నిర్వహించి, ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించారు. ఈ కేసులో మహ్మద్ పాషా, జొల్లి శివ, చెన్న కేశవులు, జొల్లు నవీన్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. 

Priyanka reddy case accused.

బాధిత కుటుంబానికి గవర్నర్ పరామర్శ 

ప్రియాంకారెడ్డి కుటుంబాన్ని తెలంగాణ గవర్నర్ తిమిళిసై పరామర్శించారు.శంషాబాద్‌లోని ప్రియాంక ఇంటికి వెళ్లిన గవర్నర్ ఏ సాయం కావాలన్నా చేస్తామని హామీ ఇచ్చారు.