ప్రియాంక హత్య కేసులో మరొకరి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంక హత్య కేసులో మరొకరి అరెస్ట్

November 30, 2019

lorry owner arrested.

సంచలనం సృష్టించిన పశువైద్యురాలు ప్రియాంకా రెడ్డి హత్యకేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులు ఈ నేరానికి అడ్డం పెట్టుకున్న లారీ (TS07UA3335) యజమాని శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనివాస్ వద్ద ప్రధాన నిందితుడు మహమ్మద్ పాషా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిందుతులు వెల్లడించని ఇతర వివరాలను, పాషా గత చరిత్రను తెలుసుకోడానికి అతణ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి ఇటుకల లోడుతో వచ్చిన లారీని నిందితులు తొండుపల్లి టోల్ గేట్ వద్ద నిలిపి, ప్రియాంకను చెరబట్టిన సంగతి తెలిసిందే. నిందితులకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. వారిని తమకు అప్పగిస్తే సరైన న్యాయం చేస్తామంటూ యువకులు పెద్ద సంఖ్యలో జైలువద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు.