జైలు వద్దా ఉద్రిక్తత.. మాకు అప్పగిస్తారా, ఉరి తీస్తారా?  - MicTv.in - Telugu News
mictv telugu

జైలు వద్దా ఉద్రిక్తత.. మాకు అప్పగిస్తారా, ఉరి తీస్తారా? 

November 30, 2019

ప్రియాంకా రెడ్డి హత్యపై తెలంగాణలో తీవ్ర నిరసనలు పెల్లుబుకుతున్నాయి. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దుండగులను తమకు అప్పగిస్తే సరైన న్యాయం చేస్తామని జనం వీధుల్లోకి వస్తున్నారు. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టిన వేలాది జనం.. నిందితులను చర్లపల్లి జైలుకు తరలించడంతో అక్కడ కూడా నిరసన తెలుపుతున్నారు. 

charlapally jail.

‘వి వాంట్ జస్టిస్.. వారిని మాకు అప్పగించండి. లేకపోతే పబ్లిగ్గా ఉరితీయండి.. జైలుకు తీసుకెళ్లి బిర్యానీ పెట్టి మేపుతారా? బెయిళ్లు ఇచ్చి మళ్లీ రోడ్లపైకి వదుతారా? అసలైన న్యాయం మేం చేస్తాం..’ అని యువతీయువకులు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి నిందితులను తీసుకొచ్చిన వాహనాలపై చెప్పులు, రాళ్లు విసిరారు. నిందితులను జైలుకు తీసుకొస్తారని తెలుసుకున్న నిరసనకారులు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు యథాప్రకారం లాఠీ చార్జి చేస్తున్నారు. అయినా కొందరు ఆందోళన నిర్వహిస్తున్నారు. నిందితులు జనానికి దొరికితే వాళ్లను చంపేస్తారన్న భయంతో పోలీసులు గట్టి భద్రత మధ్య వారిని జైలుకు తరలించారు. మొదట మహబూబ్ నగర్ జైలుకు తరలిస్తారని వార్తలు రాగా, చివరకు చర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు.