షాద్‌నగర్‌లో ఉద్రిక్తత.. కఠిన శిక్షకు డిమాండ్ - MicTv.in - Telugu News
mictv telugu

షాద్‌నగర్‌లో ఉద్రిక్తత.. కఠిన శిక్షకు డిమాండ్

November 30, 2019

Shadnagar..

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి ఘటన పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.  షాద్‌నగర్‌ పోలీసు స్టేషన్‌‌కు నిరసనకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున మహిళలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు రోడ్డెక్కారు. నిందితులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లేందుకు వందలాది మంది ప్రయత్నించారు. దీంతో అక్కడ కొంత సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. 

కోర్టుకు హాజరుపరిచే ముందు నిందితుల ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ తయారు చేసేందుకు ఆస్పత్రికి కూడా తీసుకెళ్లే మార్గం లేకపోయింది. ఏం చేయలేని పరిస్థితిలో వైద్యులనే పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పరీక్షలు నిర్వహించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చేయాలని చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక ఘటనపై వివిధ ప్రాంతాల్లోనూ నిరసన ర్యాలీలు చేపట్టారు. నిందితుల దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు.