తాగి, గాలి తీసేసి.. నోరును గట్టిగా అదిమిపట్టి..   - MicTv.in - Telugu News
mictv telugu

తాగి, గాలి తీసేసి.. నోరును గట్టిగా అదిమిపట్టి..  

November 29, 2019

Priyanka reddy case .

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డిని నిందితులు పక్కా పథకం ప్రకారం  అత్యాచారం చేసి, చంపేశారని పోలీసులు తెలిపారు. ఆమె స్కూటర్‌కు గాలి తీసినప్పటి నుంచి పెట్రోల్ పోసి కాల్చేవరకు జరిగిన దారుణాన్ని వివరించారు. శంషాబాద్‌లో ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఈ వివరాలు వెల్లడించారు. 

‘ఈ కేసులో నలుగురిని నిందితులుగా గుర్తించాం. ప్రధాన నిందితుడు పాషా అలియాస్ ఆరిఫ్ (26) డ్రైవర్ నారాయణ్ పేట్ జిల్లా మక్తల్ మండలం జక్కులూరు, జొల్లు శివ (20) క్లీనర్ మక్తల్ మండలం గుడిగgడ్ల గ్రామం,  జొల్లు నవీన్ (23) క్లీనర్ గుడిగండ్ల, చింతకుంట చెన్నకేశవులు(20) డ్రైవర్ గుడిగండ్ల ఆమెను బలితీసుకున్నారు. బుధవారం వీరు తమ లారీలోని సరుకును హైదరాబాద్‌లో అన్ లోడ్ చేయాల్సి ఉంది. అయితే సరుకును తీసుకునే వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో లారీని తొండుపల్లి టోల్ గేట్ వద్ద ఆపారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రియాంక స్కూటీని అక్కడ ఆపడం వారు చూశారు. అప్పటికే మద్యం తాగి ఉన్నారు. ప్రియాంక రాగానే చెరబట్టాలని పథకం వేశారు. ఆమె స్కూటర్‌కు నవీన్ గాలి తీశాడు.  ప్రియాంక తిరిగి రాగానే పాషా ఆమె వద్దకు వెళ్లి ‘మీ బండి పంక్చర్ అయింది’ అని చెప్పాడు. శివ బండిని తీసుకెళ్లాడు. పంక్చర్లు వేసే దుకాణం మూసేశారని చెప్పి మళ్లీ తీసుకొచ్చాడు. తర్వాత పాషా ఆమెను లాక్కుని పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లాడు. తర్వాత ప్రియాంక అరవకుండా ఆమె నోటిని, ముక్కును గట్టిగా మూసి అత్యాచారం చేశారు. ముక్కూ, నోరూ గట్టిగా మూయడంతో ఊరిపి ఆడక ఆమె అక్కడే చనిపోయింది. 10.08 గంటల ప్రాంతంలో ఆమె చనిపోయింది. తర్వాత నిందితులు మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి తీసుకెళ్లారు. ఇద్దరు స్కూటర్‌పై, ఇద్దరు లారీలో వెళ్లారు. పాాషా , చెన్నకేశవులు ప్రియాంక మృతదేహాన్ని లారీలో వేసుకుని వెళ్లారు. స్కూటర్ పై ఉన్న నిందితులు రోడ్డుపై పెట్రోల్ కోసం తిరిగారు. పెట్రోల్ బంకులో పెట్రోల్ కొన్నారు. చటాన్ పల్లి కల్వర్టు కింద మృతదేహాన్ని కాల్చేశారు. పూర్తిగా కాలిందా లేదా అని మళ్లీ వెనక్కి వచ్చి చూశారు. తర్వాత హైదరాబాద్‌కు వెళ్లి లారీలోని సరుకుని దించేశారు.. సీసీ ఫుటేజీల్లోని లారీ నంబరు, ఇతర వివరాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశాం’ అని సీపీ వెల్లడించారు. నిందితులను కోర్టులో ప్రవేశపెడతామని, వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని చెప్పారు.