లేచిపోయిందేమో అన్నారు..పోలీసులపై ప్రియాంక తండ్రి - MicTv.in - Telugu News
mictv telugu

లేచిపోయిందేమో అన్నారు..పోలీసులపై ప్రియాంక తండ్రి

November 29, 2019

హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యకు గురైన విషయం విదితమే. ఈ ఘటనపై ఆమె తండ్రి శ్రీధర్‌రెడ్డి స్పందించారు. ప్రియాంక కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు అమర్యాదగా మాట్లాడారని తెలిపారు. తమ కుమార్తె  కనిపించడం లేదని   ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే.. ఎవరితో లేచిపోయిందోనంటూ ఇబ్బందికరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Priyanka reddy.

ప్రియాంక మిస్సింగ్ కేసు తమ పరిధిలోకి రాదని శంషాబాద్ పోలీసులు చెప్పారని.. రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయమన్నారని తెలిపారు. అక్కడికి వెళ్తే ప్రియాంక అదృశ్యమైన ప్రాంతం శంషాబాద్‌ కిందకే వస్తుందన్నారని.. ఇలా ఫిర్యాదు తీసుకోవడానికే రెండు, మూడు గంటలు జాప్యం చేశారని తెలిపారు. పోలీసుల నుంచే తీవ్ర జాప్యం జరిగిందని.. ముందే పోలీసులు స్పందిస్తే తమ కూతురు బతికి ఉండేదని వాపోయారు. ప్రియాంక తల్లి విజయమ్మ మాట్లాడుతూ.. ‘ఫిర్యాదు చేయడానికి వెళ్లినపుడు వాళ్ల ఫ్రెండ్స్‌తో వెళ్లిపోయిందేమోజ  ఏం జరిగిందో.. నిజాలు మాత్రమే చెప్పండి అని మమ్మల్నే దబాయించి అడిగారు. వెళ్లేటప్పుడు సీసీటీవీ ఫుటేజీ ఉందని, తిరిగి వచ్చేటపుడు ఫుటేజీ లేదని చెప్పాయి.  ఎవరితోనైనా వెళ్లి ఉంటుందిలే రేపు వస్తుంది  చూడండి అని అన్నారు.. పోలీసులు సకాలంలో స్పందించి వుంటే మా పిల్ల బతికేది.. ’ అని ఆవేదన వ్యక్తం చేశారు.