ప్రియాంక హత్యకేసు.. నిందితుల్లో ఒకడిది ప్రేమపెళ్లి.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంక హత్యకేసు.. నిందితుల్లో ఒకడిది ప్రేమపెళ్లి..

November 29, 2019

Priyanka Reddy' .

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు చేధించారు. నలుగురు నిందితులు కలిసి ఆమెను అత్యాచారం చేసి హత్య చేశారని తేల్చారు. నిందితుల కారణంగా తమ గ్రామానికి చెడ్డ పేరు వచ్చిందని నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామవాసులు అంటున్నారు. నిందితులు చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌ కుమార్‌ ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డారంటే నమ్మలేకపోతున్నామని వెల్లడించారు. వాళ్లంతా మంచివాళ్లని.. సొంతూరిలో బాగానే ఉండేవారని చెప్పారు.  వారి తల్లిదండ్రులు కూడా మంచివాళ్లేనని, కూలిపని చేసుకుని జీవిస్తున్నారని చెప్పారు. ఐదు నెలల క్రితం చెన్నకేశవులు ప్రేమ పెళ్లి చేసుకున్నాడని చెప్పారు.

ప్రేమ పెళ్లి చేసుకున్నవాడు ఇలాంటి దారుణానికి పాల్పడతాడని అనుకోలేదని అన్నారు. గుడిగండ్ల గ్రామంలో 60 మంది వరకు లారీల మీద పనిచేస్తున్నారు. ఈ హత్య కేసులో లారీ నంబర్‌ ఆధారంగానే నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహ్మద్‌ పాషాది గుడిగండ్ల పక్క గ్రామమైన జక్లేర్‌. అతడి దగ్గర చెన్నకేశవులు, నవీన్‌, శివ క్లీనర్లుగా పని చేస్తున్నారు. వాళ్లు పథకం ప్రకారమే ప్రియాంక స్కూటర్ టైర్‌ను పంక్చర్ చేసి తర్వాత ఆమెను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. 

ఓ ఆడపిల్ల ఉసురు తీసుకున్న ఆ నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని గుడిగండ్ల, జక్లేర్‌ గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు నిందితుల కుటుంబ సభ్యులు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. శివ తండ్రి మాట్లాడుతూ.. ‘మూడు నెలల నుంచి లారీ క్లీనర్‌‌గా పనిచేస్తున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు వచ్చి కుమారుడిని తీసుకెళ్లారు. ఊరిలో మంచిగానే ఉండేవాడు. ఎటువంటి చెడు పనులు చేయలేదు. ఆవారాగా తిరుగుతుండటంతో నేను తిట్టేవాడిని. నా కొడుకు మైనర్‌, అతడి వయసు 17 ఏళ్లు మాత్రమే’ అని చెప్పాడు. కాగా, నిందితుల్లో ఓకరు వాడే బైక్ పై డేంజర్ గుర్తు, టైరు పైన మడ్గట్‌పై రాక్షస బొమ్మలు ఉన్నాయి. దీన్నిబట్టే వాళ్లు ఎంతటి రాక్షసులో అర్థం చేసుకోవచ్చని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.