ప్రియాంక్ గాంధీకి కొత్తపేరు పెట్టిన డిప్యూటీ సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంక్ గాంధీకి కొత్తపేరు పెట్టిన డిప్యూటీ సీఎం

June 6, 2020

Priyanka Gandhi.

ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాకు కొత్త పేరు పెట్టారు. ఆమెకు ‘ప్రియాంకా ట్విటర్‌ వాద్రా’గా నామకరణం చేశామని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్రియాంక గాంధీని మాత్రమే ఒక గొప్ప జాతీయస్థాయి నాయకురాలిగా చూపిస్తోందని కానీ, ప్రజలు మాత్రం ఆమెను అలా గుర్తించడంలేదని ఎద్దేవా చేశారు. తన సోదరుడు రాహుల్ గాంధీని 2019 ఎన్నికల్లో కూడా గెలిపించుకోని ఆమె.. జాతీయ నాయకురాలు ఎలా అవుతుందని ప్రశ్నించారు. 

ప్రియాంకా గాంధీని తానెప్పుడూ సిరియస్‌గా పరిగణించలేదనీ.. అందుకే ఆమెకు ‘ప్రియాంక ట్విటర్ వాద్రా’గా తాము ఎప్పుడో నామకరణం చేశామని అన్నారు. ‘రెండు మూడు రోజులకు ఒక ట్వీట్‌ చేస్తూ మీడియాలో బిజీ అయిపోతారు. సోషల్‌ మీడియా మాత్రమే ఆమెను జాతీయ స్థాయి నాయకురాలిగా చూపిస్తోంది. అంతేగానీ ప్రజలు అమెను అస్సలు పట్టించుకోవడం లేదు’ అని మౌర్య అన్నారు. కాగా, ప్రియాంకా గాంధీ లాక్‌డౌన్ కారణంగా ఎక్కువగా ట్విటర్‌లో స్పందిస్తున్న సంగతి తెలిసిందే. వలస కార్మికుల గురించి ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం మీద  విమర్శలు చేశారు. మరోవైపు యూపీకి చెందిన వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చేందుకు సొంతంగా వాహనాలను కూడా ఏర్పాటు చేశారు.