Priyanka vadra jumped from the barricades in delhi
mictv telugu

వీడియో : బారికేడ్లపై నుంచి జంప్ చేసిన ప్రియాంక.. ఢిల్లీలో నిరసన

August 5, 2022

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నల్లటి దుస్తులు ధరించి దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఈడీ దాడులకు వ్యతిరేకంగా జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఇందులో భాగంగా ప్రధాని నివాసం ముట్టడితో పాటు రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీగా వెళ్తుండగా, పోలీసులు ఆ మార్గాన్ని బారికేడ్లతో మూసేశారు. అయితే ఎంతమాత్రం వెనక్కి తగ్గని ప్రియాంకా వాద్రా.. శ్రేణులను తానే ముందుండి నడిపించారు. ఆ క్రమంలో అడ్డుగా ఉన్న బారికేడ్లపై నుంచి జంప్ చేసుకుంటూ ముందుకు కదిలారు. ఈ ఘటనను వీడియో తీసిన కాంగ్రెస్ పార్టీ దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో కాంగ్రెస్ తరపున కాబోయే నాయకురాలు అంటూ ఆ పార్టీ మద్ధతుదారులు ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.