డ్రెస్సుకు డ్రెస్సుతోనే జవాబు..! - MicTv.in - Telugu News
mictv telugu

డ్రెస్సుకు డ్రెస్సుతోనే జవాబు..!

May 31, 2017

బెర్లిన్ లో ప్రధాని మోదీ ముందు ఆ దుస్తుల్లో కాలుపై కాలేసుకుని కూర్చోవడంలో తప్పేలేదంటోంది ప్రియాంక చోప్రా. ‘లెగ్స్‌ ఫర్‌ డేస్‌. ఇది జీన్స్‌ వల్ల వచ్చిన అందం.’ అని క్యాప్షన్‌ తో పొట్టి దుస్తులు వేసుకున్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కొందరు అభిమానులు ఆమెను తిట్టిపోస్తుంటే మరికొందరు తగిన అన్సార్ ఇచ్చావంటూ వెనకేసుకొస్తున్నారు.బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మంగళవారం బెర్లిన్‌లో ప్రధాని మోదీని కలిసింది. అయితే ఆమె వేసుకున్న దుస్తులు, కూర్చున్న తీరు వివాదాస్పదమైంది. కాళ్లు కనిపించేలా డ్రెస్సు వేసుకోవడమే కాకుండా అంత పెద్ద మనిషి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడంతో నెటిజన్లు ప్రియాంకపై మండిపడ్డారు.

ప్రియాంక మాత్రం ఇది ఏమాత్రం తప్పుగా అనిపించడంలేనట్టు ఉందంటోంది. అందుకే బెర్లిన్‌లోని ఓ హోటల్‌లో ప్రియాంక తన తల్లి మధు చోప్రాతో కలిసి పొట్టి దుస్తులు వేసుకున్న ఫొటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ‘లెగ్స్‌ ఫర్‌ డేస్‌. ఇది జీన్స్‌ వల్ల వచ్చిన అందం.’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ పోస్టుపై కొందరేమో ప్రియాంక చేసింది తప్పు.. ఆమెకు పొగరు.. ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నావో మర్చిపోయావా.. అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరమేమో విమర్శకులకు తగిన సమాధానమిచ్చావు అని అంటున్నారు.