హేయ్ కబడ్డీ.. లే కబడ్డీ.. ప్రో కబడ్డీ.. ! - MicTv.in - Telugu News
mictv telugu

హేయ్ కబడ్డీ.. లే కబడ్డీ.. ప్రో కబడ్డీ.. !

July 28, 2017

పక్కా దేశీయ ఆట ఏదైనా వుందీ అంటే అది కబడ్డీనే.గ్రామీణ ప్రాంతాల్లోని యువకులను ,వారి నైపుణ్యాన్ని  ప్రోత్సహించాడానికి  ఏర్పడినదే  ప్రో కబడ్డీ.  భారతదేశంలో కబడ్టీ ఆట అనేది ఓ అంతర్భాగం. కబడ్డీ ఆట అనేది శరీరానకి మంచి వ్యాయామం అని చెప్పొచ్చు.అంతే కాదు ఈ గేమ్ లో మంచి జోష్ వుంది. అయితే ఈ కబడ్డీని విశ్వవ్యాప్తం చెయ్యాలనే ఆలోచనలోంచి పుట్టిందే ‘ ప్రో కబడ్డీ ’.

అందుకోసం ‘ మషాల్ ’ స్పోర్ట్స్ సంస్థ వాళ్ళు స్టార్ ఇండియాతో కలిసి నడుం కట్టారు. ఈ ఆలోచనకు బీజం పడింది 1994 లో ఆ సంస్థ ఫౌండర్స్ ఆనంద్ మహీంద్రా, చారుశర్మ ల మనసుల్లో. ఈ క్రీడను భారతదేశం గర్వించేలా విశ్వవ్యాప్తం చెయ్యాలని తపించారు. ఇంటర్నేషనల్ స్టాండర్స్, ప్రత్యేక పోకడలతో ఈ ఆటను మరింత ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలుత అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లు కలిసి ఈ ప్రో కబడ్డీని ప్రమోట్ చెయ్యటం విశేషం. అలాగే జైపూర్ పింక్ పాంథర్స్ టీం ఫ్రాంఛైజీకి ఓనర్ కూడా అభిషేక్ బచ్చన్. ఇప్పుడు యూత్ లో కబడ్డీ మీద మంచి క్రేజ్ ఏర్పడింది. 12 రాష్ట్రాలు, 11 టీంలతో ఇప్పటి వరకు నాలుగు సీజన్లను కంప్లీట్ చేస్కుంది.

టీంలు,వాటి కెప్టెన్లు మరియు టీం ఓనర్లు

1. బెంగాల్ వారియర్స్ సుజీత్ సింగ్ బర్త్ రైట్ గేమ్స్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లిమిటెడ్

2. బెంగాల్ బుల్స్ రోహిత్ కుమార్ WL. లీగ్ ప్రై.లిమిటెడ్

3. దబాంగ్ ఢిల్లీ k.c మెహరాజ్ షేఖ్ రాధా కపూర్ ఖన్నా

4. గుజరాత్ ఫార్ట్యూన్ గెయిన్ట్స్ సుఖేష్ హెగ్డే గౌతమ్ అడానీ

5. హర్యానా స్టీలర్స్ సురెందర్ నాడ JSW స్పోర్ట్స్

6. జైపూర్ పింక్ పాంథర్స్ మంజీత్ చిల్లర్ అభిషేక్ బచ్చన్

7. పాట్నా పిరేట్స్ ప్రదీప్ నర్వాల్ రాజేష్ వి. షాహ్

8. పునేరి పలటాన్ దీపక్ నివాస్ హుడా ఇన్ ష్యూర్ కోట్ ప్రై.లిమిటెడ్

9. తమిళ తలైవాస్ అజయ్ ఠాకూర్ ఐక్వెస్ట్ ఎంటర్ ప్రైజెస్ అండ్ బ్లాస్టర్స్ స్పోర్ట్స్ వెంచర్స్ pvt.ltd

10. తెలుగు టైటన్స్ రాహుల్ చౌదరి శ్రీనివాస్ శ్రీరామనేని – వీరా స్పోర్ట్స్

11. యు ముంబా అనూప్ కుమార్ రోనియె స్ర్కీవ్ వాలా

చాలా మంది యువత ఇప్పుడు కబడ్డీ క్రీడ మీద ఇంట్రస్టు చూపుతున్నారు. కారణం ఈ క్రీడ కార్పోరేట్ లెవల్లో పబ్లిసిటీ అవడమే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతను ఈ క్రీడ వైపు ఆకర్షితులను చెయ్యటానికి మషాల్ వాళ్ళు చేసిన ప్రయత్నం సఫలమైందనే చెప్పొచ్చు. స్టార్ ఇండాయా ఛానల్ ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడం విశేషం. ఇవాళ్టి నుండి 5 వ సీజన్ స్టార్ట్ అవనుంది. ఇప్పటి వరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేస్కుంది. జూలై 28 2017 నుండి ప్రారంభమవనున్న ప్రో కబడ్డీ 5 వ సీజన్ మీద దేశం యావత్తు చాలా క్రేజీగా ఎదురుచూస్తున్నారు. కబడ్డీని ఇష్టపడేవాళ్ళు స్టార్ ఛానళ్ళకు కళ్ళు అతికించేసారు. ముంబయిలో 20 మే 2014 న 8 జట్ల ఆటగాళ్ళ వేలం ముగిసాక అగ్రిమెంట్ సంతకాలు జరిగాయి.

సీజన్ 1

ప్రో కబడ్డీ మొదటి సీజన్ 26 జూలై 2014 నుండి – 31 ఆగస్టు 2014 వరకు కొనసాగింది. డబుల్ రౌండ్ రాబిన్ మ్యాచులు, రెండు సెమీ ఫైనల్స్, మూడో స్థానం మరియు ఫైనల్ ఆటలుగా సాగాయి. 56 ఆటలను మొదటి రౌండ్లో ఆడవలసి వచ్చింది. 8 జట్లు మొదటి ఎడిషన్లో పాల్గొన్నాయి. ఈ మ్యాచ్ ముంబయిలో స్టార్ట్ అయింది. Uముంబా తెలుగు టైటన్స్ మధ్య జరిగింది. ఆగష్టు 31 న ఫైనల్ మ్యాచ్ జరిగింది. తొలి ప్రో కబడ్డీ లీగ్ గెలవటానికి జైపూర్ పింక్ పాంథర్స్ 35 పరుగుల తేడాతో Uముంబాను ఓడించింది.

సీజన్ 2

స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ సీజన్ 2 జూలై 18 నుండి 23 ఆగస్టు 2015 వరకు సాగింది. ఈ సీజన్లో సెమీ ఫైనల్స్, ఫైనల్తో మొత్తం 60 మ్యాచ్లు ఆడారు. జులై 18 న తెలుగు టైటన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య మొదటి ఆట ఆడబడింది. ఫైనల్ ఆగస్టు 23 న ముంబయిలో Uముంబా మరియు బెంగళూరు బుల్స్ మధ్య రసవత్తరమైన పోటీ జరిగింది. 2 వ సీజన్ ను గెలవటానికి Uముంబా – బెంగళూరు బుల్స్ 36-30 తేడాతో ఓడించింది. బెంగళూరు బుల్స్ రెండో స్థానంలో నిలిచింది. తెలుగు టైటాన్స్ ఈ లీగ్ లో మూడవ స్థానంలో నిలిచింది.

సీజన్ 3

సీజన్ 3 లో రెండు ఎడిషన్లుగా ఆడారు. స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీని 5 వారాల కార్యక్రమంగా తయారు చేయాలని స్టార్ ఇండియా సి.ఈ.ఓ సంజయ్ గుప్తా ధృవీకరించారు. ఈ టోర్నమెంట్ ను జనవరి – ఫిబ్రవరి 2016 లో ఒకసారి మరియు జూన్ – జూలై 2016 లో ఒకసారి ఆడాలనే ప్రణాళికగా సాగింది. ఇది కూడా 8 జట్లుగా ఆడబడింది. పాట్నా పిరేట్స్ ఢిల్లీ ఫైనల్లో 3 పాయింట్ల తేడాతో ట్రోఫీని సాధించింది. ఈ సీజన్లో పునేరి పలటాన్ జట్టు మూడవ స్థానంలో నిలిచింది.

సీజన్ 4

మూడు సీజన్లను విజయవంతంగా ముగించుకున్న ప్రో కబడ్డి 4వ సీజన్ లోకి అడుగు పెట్టింది. జూన్ 25 నుండి జూలై 31 వరకు జరిగింది. ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. పురుషుల ఫైనల్లో పాట్నా పిరేట్స్ – జైపూర్ పింక్ పాంథర్స్ ను ఓడించింది. సీజన్ 4 లో మొట్టమొదటి మహిళా కబడ్డీ లీగ్, మహిళల కబడ్డీ ఛాలెంజ్ (WKC) లను ప్రారంభించారు. ఈ సీజన్లో ఐస్ డివాస్, ఫైర్ బర్డ్స్ మరియు స్టార్మ్ క్వీన్స్ మొదటి మూడు WWC చాంపియన్లుగా నిలిచారు. హైదరాబాద్ లో పురుషుల ఫైనల్ తో , స్టార్మ్ క్వీన్స్ ఫైర్ బర్న్స్ ను ఓడించి 4వ సీజన్ ను గ్రేట్ ఫుల్ గా ముగించారు.

సీజన్ 5

2017 ప్రో కబడ్డీ లీగ్ యొక్క ఐదవ ఎడిషన్ జూలై 28 2017 న అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, తమిళనాడు మరియు గుజరాత్ రాష్ట్రాల నుండి కొత్త జట్లు సహా మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. కొత్త సీజన్ కొరకు వేలం పాటలు మేలో జరిగాయి. మొత్తం 12 ఫ్రాంచైజీలు కలిగి రూ. 46.99 కోట్లు వ్యయం అంచనాతో ముందుకు సాగుతోంది.

ఈ సీజన్ లో రూ. 93 లక్షల మొత్తానికి ఉత్తర ప్రదేశ్ జట్టు కొనుగోలు చేసిన నితిన్ తోమార్ను వేలం అత్యంత ఖరీదైనది. రెండో స్థానంలో బెంగళూరు బుల్స్ బరిలోకి దిగిన తర్వాత రోహిత్ కుమార్ కు రూ. 81 లక్షల ధర పలికింది. ఇందులో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడు దక్షిణ కొరియా యొక్క జాంగ్ కున్ లీ.
భారతీయ క్రీడల చరిత్రలో ఈ రకమైన అతి పెద్ద లీగ్ టోర్నమెంటు లేదనే చెప్పుకోవచ్చు. 11 రాష్ట్రాల్లో 13 వారాల కాల వ్యవధిలో ఇది 130 పైగా మ్యాచ్ లను కలిగి ఉంది.

ఈ సీజన్ కూడా గత సీజన్ల మాదిరి గొప్ప సక్సెస్ అవుతుందనేది కబడ్డీ అభిమానుల ఆశ !