మనిషికి నిద్ర చాలా అవసరం. నిద్రలేమితో అనేక సమస్యలు చుట్టుముడతాయి. ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరూ నిద్రలేమి సమస్యలతోనే బాధపడుతున్నారు.ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. మానసిక ఒత్తడి, విపరీతమైన ఆలోచనలతో రాత్రి పూట నిద్రపట్టక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది. దీని ద్వారా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్ వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
వయసును బట్టి నిద్ర అవసరం ఉంటుంది. వైద్యనిపుణల సూచన మేరకు నవజాత శిశువులకు రోజులో 11-14 గంటల నిద్ర అవపరం కాగా, 3-5 ఏళ్ళ పిల్లలకు 10 – 13 గంటలు నిద్ర ఉండాలి.. 14-17 ఏళ్ళ వాళ్లకు 8 నుంచి 10 గంటల వరకు నిద్ర అవసరం. ఇక 18 – 60 మధ్య వయసు గల వారు 7 నుండి 9 గంటలు పోవాలి. 60 సంవత్సరాల పైన వారు 6 నుండి 8 గంటల పాటు నిద్రపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
నిద్రకు దూరమైతే మెదడుపై కూడా ప్రభావం పడుతోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేకుంటే వయుస్సు రెండేళ్లు ముందుకు వెళ్లిపోతుందని పరిశోధనలో వెల్లడైంది. ఒక్కరోజు పూర్తిగా నిద్రకు దూరమైతే వయస్సు 1-2 సంవత్సరాలు పెరిగినట్లు మెదడు వ్యవహరిస్తుందని “జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్” పరిశోధనలో వెల్లడైంది. అయితే తర్వాత రోజు సంపూర్ణంగా..గాఢమైన నిద్రకలిగితే యథాస్థితికి వస్తుందని శాస్తవేత్తలు తెలిపారు. రోజులో కనీసం3-8 గంటలు నిద్రపోతే ఇలాంటి దుష్ప్రభావాలు కనిపించడం లేదని తెలిపారు.మొత్తం 134 మంది ఆరోగ్యవంతుల్లో ఈ పరిశోధన చేశారు. వీరిలో 42 మంది మహిళలు కాగా..92 మంది పరుషులు. వీరందరి ఒకరోజు నిద్రలేకుండా ఉంచి వారిపై ఈ పరిశోధనలు చేయగా ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.