రైతుల ఖాతాల్లోకి 'పీఎం కిసాన్' డబ్బులు…చెక్ చేయండిలా
దేశంలోని రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా వ్యవసాయ భూమి ఉన్న రైతు ఖాతాలో ప్రతి ఏడాది రూ.6,000 మూడు వాయిదాల్లో చెల్లిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మే నెలలో రావాల్సిన మొదటి విడత రూ.2000లను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలోనే విడుదల చేసింది. అయితే కొందరికి ఈ డబ్బులు జమ కాలేదని విమర్శలు వస్తున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు మీ ఖాతాలో జమ అయ్యయో లేదో ఇలా తెలుసుకోవచ్చు.
* పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయండి.
* Farmers corner సెక్షన్‌లో Beneficiary Status క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
* ఆధార్ నెంబర్ / బ్యాంక్ అకౌంట్ నెంబర్ / మొబైల్ నెంబర్ ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవాలి.
* నెంబర్ ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయాలి.
* మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో, అకౌంట్‌లో డబ్బులు జమ అయ్యాయో లేదో స్టేటస్ తెలుస్తుంది.