producer allu aravind reaction on varasudu movie controversy
mictv telugu

తెలుగు చిత్రాలపై తమిళనాడులో భారీ నిరసనలు

November 19, 2022

పాన్ ఇండియా చిత్రాలతో సౌత్ ఫిలిమ్స్ నార్త్ ని షేక్ చేస్తున్నాయి. వందల, వేల కోట్ల కలెక్షన్స్ తో సినిమాకి భాషాభేదం లేదని చాటిచెప్తున్నాయి. అయితే ఒకవైపేమో దేశం గర్వించే సినిమాలని తీస్తూ మరోవైపేమో సొంత రాష్ట్రాల్లో అబాసుపాలవుతున్నారు. ఆర్ఆర్ఆర్, పుష్ప, పొన్నియన్ సెల్వన్, విక్రమ్ వంటి సినిమాలతో ప్రాంతీయత అనే లైన్ ని తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలు చెరిపేసినా.. సంక్రాంతి సీజన్ రెండు పరిశ్రమల మధ్య పెను వివాదాన్ని తీసుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి.ఈ సమయంలో థియేటర్స్ అన్ని కిటకిట లాడుతాయి. సంక్రాంతి అంటేనే సినిమా సీజన్ అని పేరుంది. స్టార్ హీరోలు సంక్రాంతి బెర్తుని 6నెలల ముందే బుక్ చేసుకుంటారు. డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు, సినీ కార్మికుల జేబులు నిండే ఈ సీజన్ కి మొదటి ప్రాధాన్యతగా తెలుగు సినిమాలనే పెట్టాలని తెలుగు నిర్మాతల మండలి నోటీసులు ఇచ్చింది. సంక్రాంతి సీజన్ కి డబ్బింగ్ సినిమాలని రెండవ ప్రాధాన్యతగా చూడాలని చెప్పింది. అయితే టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ పెట్టిన ఈ కండిషన్ ఇప్పుడు తమిళనాడు నిర్మాతలకి కోపం తెప్పిస్తుంది.

‘మీరు మా సినిమాలకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తే.. అసలు మేము తెలుగు సినిమాలనే బ్యాన్ చేస్తాం’ అంటూ కోలీవుడ్‌ డైరెక్టర్స్ టాలీవుడ్ డెసిషన్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలుగు సినిమాలను తమిళంలో అడ్డుకుంటామని చెబుతున్నారు. తాము కూడా తెలుగు చిత్రాలను అడ్డుకుంటామని దర్శకుడు సిమాన్‌ కామెంట్లు చేయడం పెద్ద దుమారం రేపుతున్నాయి. చిరంజీవి `వాల్తేర్‌ వీరయ్య`, బాలకృష్ణ `వీరసింహారెడ్డి`, అఖిల్‌ `ఏజెంట్‌` సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. వీటితో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ చిత్రం కూడా సంక్రాంతికి విడుదల కానుండటమే ఈ వివాదానికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై నిర్మాత అల్లు అరవింద్‌ స్పందించారు. `తోడెలు` ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ అందరిది అని, అన్ని సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని పేర్కొన్నారు. ఇప్పుడు సినిమాకి సౌత్‌, నార్త్ అనే తేడా లేదని స్పష్టం చేశారు. ఇక్కడ బాగున్న సినిమా అక్కడ ఆడుతుంది, అక్కడ బాగున్న సినిమా ఇక్కడ ఆడుతుందన్నారు. సినిమాలను అడ్డుకోవడం ఎవరికి సాధ్యం కాదని తేల్చి చెప్పారు.