ప్రతి ఆడపిల్ల తన తల్లిదండ్రులతో కలిసి చూడాల్సిన చిత్రం రైటర్ పద్మభూషణ్(Writer Padmabhushan)అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆడపిల్లలు ఏమవ్వాలనుకుంటున్నారో తెలుసుకొని ఆ దిశగా ప్రొత్సహించాలని సూచించారు. రైటర్ పద్మభూషణ్ విజయవంతం కావడంతో మూవీ సక్సెట్‌మీట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని అల్లు అరవింద్ మాట్లాడారు. ఆడపిల్లలను వారికి ఇష్టమైన పని చేయనివ్వాలని సూచించారు. ఈ చిత్రాన్ని చూసి ఇంటికి వెళ్లాక నా భార్యను నువ్వు ఏం అవ్వాలనుకున్నావు అని అడిగినట్లు అరవింద్ తెలిపారు.
ప్రతి ఆడపిల్లకు కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయని వాటిని గౌరవించాలని రైటర్ పద్మభూషణ్ చిత్రం తెలియజేస్తుందన్నారు. “మొదట చిత్రాన్ని రిలేజ్ చేద్దామని వాసు, ధీరజ్ చెబితే నేను వద్దన్నాను. తర్వాత ఓ సారి చిత్రం చూసి మనం మాత్రమే విడుదల చేయాలని చెప్పాను. ఈ సినిమాను ప్రతి ఆడపిల్లలందరూ తమ కుటుంబంతో కలిసి చూడాల్సిన చిత్రమిది. ఎందుకంటే సాధారణంగా ఆడపిల్లలనగానే చక్కగా చదువుకోవాలి. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి. వాళ్లని పెంచి పెద్ద చేయాలనే ఉంటుంది. కానీ వాళ్లకంటూ కొన్ని అభిప్రాయాలు, ఇష్టాలు ఉంటాయని తల్లిదండ్రులు గుర్తించరు. తల్లిదండ్రులు అందరూ వారింట్లోని ఆడపిల్లలు ఏమవ్వాలనుకుంటున్నారో తెలుసుకొని ఆ దిశగా ప్రొత్సహించాలని రైటర్ పద్మభూషణ్ తెలుపుతుంది. ఆడపిల్లలు ఇంట్లో కూర్చోవడానికి అంగీకరించను. వాళ్లు కూడా తమ కాళ్ల మీద నిలబడాలనుకుంటాను. నా కోడలు స్నేహరెడ్డికి పనిచేయాల్సిన అవసరం లేదు. తను ధనవంతులు ఇంట్లో పుట్టింది. ప్రస్తుతం పెద్ద స్టార్ భార్యగా ఉంది. అయినా తన పని తాను చేస్తుంది “అని అరవింద్ తెలిపారు.
పద్మభూషణ్ చిత్రంలో కలర్ ఫోటో ఫేమ్ సుహాన్ హీరోగా నటించాడు. ఫిబ్రవరి 3 న థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను వస్తున్నాయి. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ లు నిర్మించారు. ఈ చిత్రం లో టినా శిల్పారాజ్, రోహిణీ, ఆశిష్ విద్యార్థి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్‌లు
సంగీత దర్శకులగా పనిచేశారు.