శ్రావణి కేసులో నిర్మాత అశోక్‌ రెడ్డి అరెస్టు - MicTv.in - Telugu News
mictv telugu

శ్రావణి కేసులో నిర్మాత అశోక్‌ రెడ్డి అరెస్టు

September 16, 2020

sravani

సీరియల్ నటి శ్రావణి కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరు నిందితులు సాయికృష్ణా రెడ్డి, దేవరాజ్‌ రెడ్డిలను అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. తాజాగా పరారీలో ఉన్న మరో నిందితుడు ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా నిర్మాత అశోక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రావణి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన ముగ్గురు నిందితుల్లో అశోక్ రెడ్డి ఒకరు. ఏ2గా ఉన్న అశోక్‌ రెడ్డికి ఎస్ ఆర్ నగర్ పోలీసులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. సోమవారం‌ స్టేషన్ కి వస్తానని చెప్పి చివరి నిమిషంలో పరారయ్యాడు. అజ్ఞాతంలోకి వెళ్లి మొబైల్ ‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసుకున్నాడు. 

అశోక్ రెడ్డి సినీ రంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ప్రలోభపెట్టి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె దేవరాజ్‌ను ప్రేమిచడాన్ని అశోక్ ‌రెడ్డి తట్టుకోలేకపోయాడు. సాయికృష్ణ రెడ్డి ద్వారా ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు కారణమయ్యాడని తెలుస్తోంది. సెప్టెంబరు 7న అమీర్‌పేట హోటల్‌ వద్ద శ్రావణి, దేవరాజ్‌తో గొడవ తరువాత సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అశోక్‌రెడ్డి, సాయికృష్ణ కలసి శ్రావణిని శారీరకంగా హింసించారు. శ్రావణి ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్ ‌రెడ్డిది కీలక పాత్ర ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.