producer dil raju reaction on varasudu movie controversy
mictv telugu

త్వరలో అందరి లెక్కలు తెలుస్తా.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..

November 24, 2022

ఇండస్ట్రీ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. రాజు ఒక మూవీ టేకప్ చేశారంటే పక్క హిట్ అనే టాక్ వచ్చేస్తుంది. దాని వెనుక ఆయన శ్రమ కూడా కఠోరంగా ఉంటుంది. కథపై క్లారిటీ వచ్చేవరకు ఎంత సమయాన్నైనా వెచ్చిస్తాడు దిల్ రాజు. కథ చర్చలపై దిల్ రాజుకి ప్రత్యేక సైన్యం ఉంటుంది. దిల్ రాజు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేవరకు ఆ సైన్యం అహర్నిశలు కృషి చేస్తుంది. ఆయన అంతా ఓకే అన్నాకే చిత్రం పట్టాలెక్కుతోంది. కథపై ఈ కన్విక్షనే మామూలు డిస్ట్రిబ్యూటర్ నుండి దిల్ రాజుని స్టార్ ప్రొడ్యూసర్ ని చేసింది. ఇండస్ట్రీలో కథపై పట్టున్న నిర్మాతల్లో రామానాయుడు తరువాత దిల్ రాజు ఒక్కరే అంటూ మెగాస్టార్ కూడా కాంప్లిమెంట్ చేశాడు. దిల్ రాజు బ్యానర్ అంటే హీరోలు రిలాక్స్ అయిపోవచ్చు. భారమంతా ఆయనే మోస్తాడు కాబట్టి. అయితే ఇలాంటి దిల్ రాజుపై కొద్దీ రోజులుగా విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు మూవీ టార్గెట్ గా మెగా, నందమూరి ఫ్యాన్స్ నుండి ట్రోల్స్ వస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ నటుడు విజయ్ హీరోగా వారసుడు మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు దిల్ రాజు. వారసుడు సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉండటమే కాక.. సినిమా కోసం ఆంధ్ర, నైజాం ఏరియాలో పెద్ద ఎత్తున థియేటర్లు బుక్‌ చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దాంతో దిల్‌రాజుపై భారీగా విమర్శలు వస్తున్నాయి.

తెలుగు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యే ఆ సమయంలో ఇతర భాష చిత్రాలు ఎక్కువగా రిలీజ్ అవ్వవు. అభిమానుల కోసం పెద్ద థియేటర్లన్నీ మన హీరోలకే కేటాయిస్తారు. ముఖ్యంగా ఆంధ్ర, సీడెడ్ లోని థియేటర్లన్నీ మెగా, నందమూరి చిత్రాలతో కళకళ లాడుతాయి. కానీ నైజాం, ఆంద్రలోని A క్లాస్ థియేటర్స్ పై మంచి పట్టున్న దిల్ రాజు వారసుడు మూవీ కోసం పెద్ద ఎత్తున బుకింగ్స్ చేస్తున్నాడన్న మెగా, నందమూరి ఫ్యాన్స్ విమర్శలపై దిల్ రాజు తాజాగా స్పందించాడు. మసూద సినిమా సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న దిల్‌ రాజు మాట్లాడుతూ.. ‘మసూద సినిమాపై దర్శకుడికి పూర్తి నమ్మకం ఉంది. అందుకే నేను ఇచ్చిన సలహాలని పక్కనపెట్టేశారు. దర్శకుడిలో ఆ నమ్మకం నాకు నచ్చి ఈ సినిమాకి మద్దత్తుగా నిలిచా. ప్రతి దర్శకుడికి తన కథపై ఆ ప్యాషన్ ఉండాలి. అప్పుడే నా మద్దత్తు ఉంటుంది. నాపై చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. కానీ నాలో ఇంకో యాంగిల్ కూడా ఉంది. ఇది ఎవ్వరికి తెలీదు. సినిమాను ప్రేమించి.. మంచి కంటెంట్‌తో సినిమాలు తీసేవాళ్ల కోసం నేను ఏం చేయ్యడానికి అయినా రెడీ. అందుకే లవ్‌ టుడే రిలీజ్‌ చేస్తున్నాను. దాంట్లో నాకు రూపాయి కూడా మిగలదు. కానీ సినిమా మీద ప్యాషన్‌తో విడుదల చేస్తున్నాను. నాకు డబ్బులు వద్దు.. అయినా డబ్బులతో ఏం చేసుకుంటాం. చివరకు మిగిలేది ఏంటి. మనందరకి తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఆలోచిస్తాను. అలానే వారసుడు థియేటర్స్‌ వివాదం గురించి త్వరలో ప్రెస్‌మీట్‌ పెట్టి అసలు ఏం జరుగుతుందో వివరాస్తాను’’ అన్నాడు.

ఇది కూడా చదవండి : సీనియర్ నటుడు చనిపోయాడని వార్తలు..ఖండించిన ఫ్యామిలీ

ఇది కూడా చదవండి : సమంత హాట్ వీడియో.. నేషనల్ మీడియా స్పెషల్ ఫోకస్