దిల్ రాజు రెండో పెళ్లి ఫొటోలు.. కులాంతర వివాహం! - MicTv.in - Telugu News
mictv telugu

దిల్ రాజు రెండో పెళ్లి ఫొటోలు.. కులాంతర వివాహం!

May 11, 2020

Producer Dil Raju Second Marriage  

గత కొన్ని రోజులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ రెండో పెళ్లిపై వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఆదివారం రాత్రి ఆయన మరో పెళ్లి చేసుకున్నారు. కొద్ది మంది సన్నిహితుల సమక్ష్యంలో  నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలోని వెంకటేశ్వర స్వామీ దేవాలయంలో ఈ కార్యక్రమం నిర్వాహించారు. ఆయన కూతురే పెళ్లి పెద్దగా వ్యవహరించి దీన్ని జరిపించారు. దీంతో ఆయనకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్న ఆ యువతి ఎవరని అంతా ఇప్పుడు చర్చించుకుంటున్నారు.

2017లో దిల్ రాజు భార్య అనారోగ్యంతో మరణించింది. దీంతో అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న అతనికి ఓ తోడును వెతికిపెట్టాలని కూతురు హర్షిత నిర్ణయించుకుంది. తన తండ్రికి బాగా తెలిసిన అమ్మాయిని భాగస్వామిగా చేయాలని అనుకుంది. ఇందుకోసం కులాంతర వివాహం చేసింది. అమెరికాలో స్థిరపడిన ఓ యువతిని ఎంపిక చేసి వివాహం జరిపించారు.  ఆమె ఎయిర్ హోస్టస్‌గా పని  చేస్తోంది. బ్రాహ్మణ కులస్థురాలు అని వార్తలు వస్తున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను బయటకు విడుదల చేశారు. వాటిని చూసిన పలువురు కొత్త జంటకు శుభాంక్షలు చెబుతున్నారు. కాగా 2014లోనే దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డికి పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడింది. 2017లో తన తల్లిని కోల్పోవడంతో మాతృ దినోత్సవం రోజున తండ్రికి పెళ్లి చేయడం విశేషం.