దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అత్యంత సన్నిహిత నిర్మాతల్లో ఒకరు నాగవంశీ. ఈయన తీస్తున్న లేటెస్ట్ మూవీ బుట్టబొమ్మ. సొంత బ్యానర్ లో నిర్మించిన బన్నీ అలా వైకుంఠపురములో చిత్రంలోని బుట్టబొమ్మ హిట్ సాంగ్ లిరిక్ నే చిత్ర టైటిల్ గా పెట్టుకున్నారు నాగవంశీ. అయితే ఈ ‘బుట్ట బొమ్మ’ చిత్రం ఫిబ్రవరి 4న థియేటర్లలోకి రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన నిర్మాత ఎస్ నాగ వంశీ ఈ రోజు ట్రైలర్‌ను విడుదల చేశారు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ నటించిన ఈ చిత్రానికి శౌరి చంద్రశేఖర్ దర్శకుడు. ‘బుట్టబొమ్మ’ చిత్రం ‘కప్పెల’ అనే మలయాళం మూవీకి రీమేక్. ఫీల్ గుడ్ రొమాన్స్ జానర్ లో తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అయితే తన గొంతుతో తమిళంలో ఫెమస్ విలన్ అయిన అర్జున్ దాస్ తన మొదటి భారీ స్ట్రెయిట్ తెలుగు మూవీ చేస్తున్నాడు.
అయితే బుట్టబొమ్మ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఒక సరదా సన్నివేశం జరిగింది. మీడియాతో చిత్ర యూనిట్ ఇంటరాక్షన్ సందర్భంగా విలేకరి అడిగిన ప్రశ్నకు నిర్మాత నాగవంశీ ఇచ్చిన కౌంటర్ వైరల్ అవుతుంది. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో గతేడాది భీమ్లా నాయక్, డీజే టిల్లు, స్వాతిముత్యం లాంటి హిట్స్ ఇచ్చిన నాగవంశీని విలేకరి ప్రశ్నిస్తూ.. మీ సినిమాకి బుట్టబొమ్మ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? అంటే.. నాగవంశీ బదులిస్తూ.. ‘డిస్కషన్ ఏం లేదు. మా సినిమాలో పాపులర్ అయిన బుట్టబొమ్మ సాంగ్ నే దీనికి టైటిల్ గా పెట్టేశాం. నీకు పాపను చూస్తే బుట్టబొమ్మలా అనిపించట్లేదా? నీకోసం చీరకట్టుకొని రమ్మంటావా ఏంటి? అని సరదాగా కౌంటర్ వేశారు. దీంతో ఇప్పుడు నాగవంశీ మాటలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అనికా సురేంద్రన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. రీసెంట్ గా నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీలో నటించింది. మరి హీరోయిన్ గా ఈ సినిమాతో డెబ్యూ సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి :
నీ మూడు పెళ్లిళ్ల గోల ఏంటీ బయ్యా.. బాలయ్య ప్రశ్నకి పవన్ షాక్..!
బ్రేకింగ్.. పవన్ కళ్యాణ్ ఆత్మహత్య వ్యాఖ్యలు.. బాలయ్య షోలో సంచలనం..!