‘సైరా’ వివాదంపై స్పందించిన రామ్ చరణ్, సురేందర్ రెడ్డి! - MicTv.in - Telugu News
mictv telugu

‘సైరా’ వివాదంపై స్పందించిన రామ్ చరణ్, సురేందర్ రెడ్డి!

September 22, 2019

Producer ram charan, director surender reddy about syeraa controversy

విడుదలకు సిద్దమైన ప్రతిష్టాత్మక సైరా చిత్రంపై వివాదం నెలకొన్న సంగతి తెల్సిందే. కొందరు రాయలసీమ ప్రజలు తమ పూర్వీకుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సినిమాగా తీస్తూ, తమకిస్తామన్న రూ.50 కోట్లను ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, 23 మంది జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. 

ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలు స్పందించారు. తాము కేవలం ఓ నలుగురి కోసం ఈ సినిమాను తీయలేదని రామ్ చరణ్ అన్నారు. తమపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. 100 సంవత్సరాలు దాటిన కథలకు కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదన్నారు. చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి స్పందిస్తూ..తాము ఎన్నో ప్రాంతాల్లో పర్యటించి, సైరా కథను సిద్ధం చేసుకున్నామన్నారు. ఈ కథ ఏ కొద్దిమంది నుంచో సేకరించింది కాదన్నారు. కాగా, తమకు క్లయిమ్‌ను ఇస్తామని చెబుతూ అగ్రిమెంట్ రాసుకున్న చిత్ర నిర్మాత, ఆ క్లయిమ్‌లో విషయాన్ని మాత్రం చెప్పలేదని, వెంటనే తమకు న్యాయం చేయాలని, లేకుంటే, చిత్ర విడుదలను నిలిపివేయాలని శనివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీకులు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.