విశాల్ తండ్రి కేక.. 82 ఏళ్ల వయసులో కండలు చూపుతూ..  - MicTv.in - Telugu News
mictv telugu

విశాల్ తండ్రి కేక.. 82 ఏళ్ల వయసులో కండలు చూపుతూ.. 

September 16, 2020

Producer Vishal Reddy Father GK Reddy fitness video goes viral

కోలీవుడ్‌లో కేక పుట్టిస్తున్న తెలుగు కుర్రాడు విశాల్ రెడ్డి రాజకీయాలను కూడా ఒక చూపు చూస్తుంటాడు. అతడు బీజేపీలో చేరతాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ సంగతి వదిలేస్తే అతని తండ్రి, నిర్మాత జీకే రెడ్డి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. 82 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్ వీడియోతో ఠారెత్తున్నారు. కండలు తిరిగిన శరీరాన్ని చూపుతూ వీడియో పోస్ట్ చేశారు. 

ఇటీవలతో కొడుకుతోపాటు కరోనా బారిన పడ్డిన రెడ్డి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. తనెంత ఫిట్‌గా ఉన్నానో చెప్పడానికి ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. ముసలిముప్పులో అంత దారుఢ్యం ఎలా సాధ్యమైందో కూడా ఆయన వివరించారు. ఇంట్లోనే ఉండి క్రమశిక్షణతో దారుఢ్యం పెంచుకోవచ్చని అన్నారు. ‘ఇప్పుడు బయటికి వెళ్లే పరిస్థితి లేదు. తేలికపాటి ఎక్సర్‌సైజుల రోజూ చేస్తూ ఉంటే ఏ వయసులోనైనా ఫిట్‌గా ఉండొచ్చు..’ అని ఆయన చెప్పారు.