వీర్ సావర్కర్ బయో‘పిక్’ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

వీర్ సావర్కర్ బయో‘పిక్’ విడుదల

May 28, 2022

స్వతంత్య్ర యోధుడు వీర్ సావర్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం స్వతంత్ర వీర్ సావర్కర్. సావర్కర్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా నటిస్తున్నారు. శనివారం సావర్కర్ 139వ జయంతి సందర్భంగా చిత్ర బృందం మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. తెలుగులో కామెడీ విలన్ పాత్రలు పోషించిన మహేష్ మంజ్రేకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈయన కూతురు ఇటీవల వరుణ్ తేజ్ గని సినిమాలో, రాబోతున్న అడవి శేష్ మేజర్ చిత్రంలో కథానాయికగా నటించింది. ‘ఈ తరం యువత సరిగా అర్ధం చేసుకోని మహానాయకుడు వీర్ సావర్కర్. ఆయనలోని దేశభక్తిని, హిందూ ధర్మం పట్ల ఆయనకున్న అభిమానాన్ని నేటి యువతకు చెప్పాలనిపించి ఈ సినిమా తీస్తున్నానని’ దర్శకుడు గతంలో వెల్లడించారు. పోస్టర్ రిలీజ్ సందర్భంగా టైటిల్ రోల్ చేస్తున్న నటుడు రణదీప్ హుడా మాట్లాడుతూ.. ‘ చరిత్రలో మరుగున పడ్డ సావర్కర్ జీవితాన్ని వెలుపలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన పాత్రకు న్యాయం చేయడం కోసం నా శాయశక్తులా కృషి చేస్తున్నాను. దేశం కోసం పోరాడి సరైన గుర్తింపు పొందని యోధులకు ఈ సినిమాను నివాళిగా అర్పిస్తున్నాము’ అని వ్యాఖ్యానించారు.