సాయిబాబా ప్రాణాలు కాపాడండి - MicTv.in - Telugu News
mictv telugu

సాయిబాబా ప్రాణాలు కాపాడండి

October 31, 2017

నాగపూర్ జైల్లో అనారోగ్యం బారినపడి తీవ్ర ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే హైదరాబాద్ జైలుకు తరలించి మెరుగైన చికిత్స అందించాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు.

మోదీ  ప్రభుత్వం సాయిబాబాపై కక్షపూరిత వైఖరి విడిచి, ఆయనకు ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర మందులు అందించాలని కోరారు. మావోయిస్టులతో సంబంధాల కేసులో సాయిబాబాకు మహారాష్ట్రలోని గడ్చిరోలి కోర్టు జీవిత ఖైదు వేసింది. 90 శాతం అంగవైకల్యం ఉన్న సాయిబాబా ప్రస్తుతం దుర్భరమైన అండా సెల్లో, చలికి వణుకుతూ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.