విద్యా బుద్దులు నేర్పాల్సిన గురువులే కామాంధులుగా మారుతున్నారు. తమ స్థానాన్ని మరిచి విద్యార్థినిలను వేధిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. థాయ్‌లాండ్‌కి చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ రవిరంజన్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
అతడి నుంచి తప్పించుకున్న ఆమె గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిపై అత్యాచారయత్నం చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. యూనివర్సిటీలో విద్యార్థినులకు భద్రత లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రొఫెసర్ రవిరంజన్‌ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.