ఏపీని ఏలుతోంది అంబానీనా? - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీని ఏలుతోంది అంబానీనా?

October 26, 2017

విజయవాడలో ఈ నెల 28న జరగాల్సిన తన సన్మాన సభకు ఏపీ ప్రభుత్వం అనుమతివ్వకపోవడంపై ప్రొఫెసర్ కంచ ఐలయ్య భగ్గుమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడా? లేకపోతే వైశ్యుడైన అనిల్ అంబానీనా? అని ప్రశ్నించారు.

ఆయన హైదరాబాద్ లో గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సన్మాన సభకు వ్యతిరేకంగా వైశ్యలు, బ్రాహ్మణలు పోటీ సభ జరుపుతామన్న నేపథ్యంలో పోలీసులు ఆ సభలకు అనుమతి నిరాకరించడం తెలిసిందే. అయితే తన సభకు అనుమతి ఇవ్వాలని  ఐలయ్య  డిమాండ్ చేశారు.  28న కాకపోతే మరో రోజైనా  సభ జరుపుకోవడానికి అనుమతివ్వాలన్నారు.

‘నాది అంతర్జాతీయ  సమస్య. మీరు ఇలాగే నన్ను  నిర్బందిస్తే  మీకు  పెట్టుబడులు రావు.. నన్ను అరెస్ట్ చేస్తే ప్రపంచం మొత్తానికి  ఏపీలో మానవ హక్కులు లేవని  తెలుస్తుంది. పెట్టుబడుల కోసం తిరుగుతున్నారు ప్రభుత్వానికిది మంచిదికాదు’ అని అన్నారు. అంబానీకి  ఆంధ్రప్రదేశ్‌లో చమురు గనులు భారీగా ఉన్నాయని ఆరోపించారు.