కేసీఆర్‌కు నాగేశ్వర్ సవాల్.. ఆర్టీసీని వేలకోట్ల లాభాల్లో నడిపిస్తా..  - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌కు నాగేశ్వర్ సవాల్.. ఆర్టీసీని వేలకోట్ల లాభాల్లో నడిపిస్తా.. 

October 17, 2019

Professor nageshwar challenges kcr on rtc 

ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచడం వల్లే సంస్థ నష్టాల్లోకి వెళ్లిందన్న ప్రభుత్వ వాదన అర్థరహితమని ప్రముఖ సామాజిక, ఆర్థిక విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఆయన ఈ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా ఇందిరా పార్కు వద్ద సామూహిక నిరాహాదీక్షను ప్రారంభించి మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ స్థితుగతులను వివరిస్తూ, ప్రభుత్వ తీరువల్లే సమస్యలు ఎదురవుతున్నాయని ఆరోపించారు. 

‘ఆర్టీసీ ఏటా డిజీల్‌పై రూ. 1,300 కోట్లను ఖర్చ చేస్త్తోంది. అందులో రూ. 300 కోట్లను పన్నుగా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తోంది. ప్రభుత్వం ఆర్టీసీకి ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా పన్నులు వసూలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే.  ప్రైవేటు బస్సులను అడ్డుకుంటే ఆర్టీసీకి లాభాలు వస్తాయి. ప్రభుత్వ విధానాలు మారాలి. ఆర్టీసీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సు సగటు వేగం 15కి.మీ. మాత్రమే. దీనికి కారణం రోడ్లు బాగా లేకపోవడం, ట్రాఫిక్ నిర్వహణ లోపాలే. తెలంగాణాలో ఇప్పటికీ 1.400 గ్రామాలకు బస్సులు లేవు. ప్రజా రవాణా ప్రభుత్వ బాధ్యత.  కేసీఆర్ ప్రభుత్వానికి నేను సవాల్ విసురుతున్నాను. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలన్నీ నిజాలు. కాదని అంటే, చర్చకు రండి,నేను సిద్ధం. ఆర్టీసీని నడిపించడం ప్రభుత్వానికి చేతకాక పోతే మాకు అప్పచెప్పండి. ఆర్టీసీని వేల కోట్ల లాభాల్లోకి తీసుకెళ్తాం..’ అని నాగేశ్వర్ సవాల్ విసిరారు.