ఊహాగానాలు నిజమయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నాని ప్రముక రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ప్రకటించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి మార్చిలో జరిగే ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతున్నానని వెల్లడించారు.
‘గత కొన్ని రోజులుగా మీడియాలో నాపై వార్తలు వస్తున్నాయి. ఏవేవో కల్పించి రాస్తున్నారు. వాటికి ముగింపు పలికేందుకే అధికారికంగా ప్రకటన చేస్తున్నాను.. ’ అని ఆయన తెలిపారు. నాగేశ్వర్ ఈ నియోజకవర్గానికి 2014వరకు ప్రాతినిధ్యం వహించారు. ఎన్నికల్లో నాగేశ్వర్‌కు సీపీఎం మద్దతిస్తుందని భావిస్తున్నారు. కాగా అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు ఈ నియోజక వర్గంలో ఓటరు నమోదుకు దరఖాస్తులు తీసుకుంటారు. www.ceotelangana.nic.inలో ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలి.