‘మహా’ రాజకీయాలతో జబ్బు పడ్డాను.. ప్రొఫెసర్ లీవ్ లెటర్..  - MicTv.in - Telugu News
mictv telugu

‘మహా’ రాజకీయాలతో జబ్బు పడ్డాను.. ప్రొఫెసర్ లీవ్ లెటర్.. 

November 24, 2019

ఎత్తులకు పైఎత్తులు, ఊహించని మలుపులతో సాగుతున్న మహారాష్ట్ర రాజకీయాలు రాజకీయాల్లో తలలు పండిన వారికే షాకిస్తున్నాయి. ఇక సామాన్యులైతే ‘చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత’ అని తమను తామే తిట్టుకుంటుకున్నారు. కొందరు సరైన నిద్రలేక ఒత్తిడికి గురవుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల కారణంగా తాను ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడ్డానని ఓ ప్రొఫెసర్ గగ్గోలు పెడుతున్నారు. తనకు రోగమొచ్చింది కాబట్టి సెలవు కావాలని తాను పనిచేస్తున్న కాలేజీ యాజమాన్యానికి చుట్టీపత్రం రాశారు. 

Professor

చంద్రపూర్‌లోని మహావిద్యాలయ్‌లో పనిచేస్తున్న ఇంగ్లీషు ప్రొఫెసర్ జహీర్ సయ్యద్ రాసిన ఈ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరలైంది. ‘రాష్ర్టంలో సాగుతున్న రాజకీయ డ్రామా వార్తలను ఈ రోజు ఉదయం టీవీలో చూశాక షాక్’తో నేను జబ్బుపడ్డాను. కోలుకోడానికి సెలవు ఇవ్వండి.. ’ అని కోరాడు. అయితే యాజమాన్యం అందుకు తిరస్కరించింది.