'Project K'..Hollywood directors entered the arena..for this scene
mictv telugu

‘ప్రాజెక్ట్ కె’ కోసం ఐదుగురు డైరెక్టర్లు..ఈ సీన్స్ కోసమే

September 16, 2022

తెలుగు చిత్రసీమ పరిశ్రమలో అతిపెద్ద భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ఈ చిత్రంలో కథనాయకుడుగా ప్రభాస్, కథనాయికగా దీపికా పదుకొణె నటిస్తుండగా, కీలక పాత్రలో అమితా బచ్చన్ నటిస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం..ఈ చిత్రంలోని ఓ అయిదు యాక్షన్ సీన్స్ కోసం ఐదుగురు హాలీవుడ్ డైరెక్టర్లను చిత్రబృందం రంగంలోకి దించుతున్నట్లు ఓ వార్త నెట్టంట తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రాన్ని 2023కల్లా పూర్తి చేసి, 2024లో విడుదల చేస్తామని ఇటీవలే డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను రంగంలోకి దించుతున్నట్లు వైజయంతి మూవీస్ తెలియజేసింది. ”మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన అయిదు యాక్షన్ బ్లాకులు ఉన్నాయి. ప్రత్యేక వ్యూహాలతో కూడిన ఈ సన్నివేశాలను చిత్రీకరించడానికి, ఐదు వేర్వేరు యూనిట్లను నిర్మించనున్నాం. వీటిని రూపొందించడానికి ఐదుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను రంగంలోకి దించనున్నాం. మునుపెన్నడు చూడని భారీ దృశ్యరూప చిత్రంగా, అతి పెద్ద యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ప్రాజెక్ట్ కె’ ను తెరకెక్కించే పనిలో అందరం నిమగ్నమయ్యాం” అని చిత్రబృందం తెలిసింది.

‘ప్రాజెక్ట్ కె’ చిత్రం విషయానికొస్తే.. ‘పాన్ ఇండియాగా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పాత్రను ఇతిహాస ఆధారిత అశ్వత్థామ పాత్ర స్ఫూర్తితో తీర్చిదిద్దనున్నారని సమాచారం. ప్రభాస్, అమితాబ్స్ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించే ప్రణాళికను దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా రచిస్తున్నారట. ‘ప్రాజెక్ట్ కె’ ను పూర్తిగా బ్లూ అండ్ గ్రీన్ డ్యూయల్ క్రొమాటిక్ టెక్నాలజీతో తీయనున్నట్లు తెలుస్తోంది. అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్ హంగులతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నారట. 2023 సంవత్సరాంతానికి ప్రాజెక్టు కె చిత్రీకరణ పూర్తి చేసి, 2024 ప్రథమార్థంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ప్రాజెక్టు కె’ చిత్రాన్ని రూ.500 కోట్లు పైగానే బడెట్ నిర్మిస్తున్నారని సమాచారం.’