బీసీసీఐ వార్షిక కాంట్రాక్టును ప్రకటిస్తూ జాబితాను విడుదల చేసింది . ఈ జాబితాలో స్టార్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రమోషన్ లభించింది. గతంలో టాక్ కేటగిరిలో ముగ్గురు ఆటగాళ్లు ఉండగా…ఇప్పుడు నలుగురికి చేరింది. బీసీసీఐ ప్రకటించిన టాప్ కేటగిరిలో భారత కేప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్ధానాలను పదిలపర్చుకున్నారు. ఈనెలారంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జడేజా కీలకంగా వ్యవహారించిన సంగతి తెలిసిందే. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో జడేజా 22 వికెట్లు తీసాడు. బ్యాటింగ్ లోకూడా కీలకంగా రాణించాడు. ఈ కాంట్రాక్టు అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు ఉంటుంది.
వరస అపజయాలతో సతమతమవుతున్న టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కెఎల్ రాహుల్ ఏ నుంచి బి కి దిగజారాడు. ఎ ప్లస్ రూ. 7కోట్లు, ఎ రూ. 5కోట్లు, బి రూ. 3కోట్లు, సి రూ. కోటి అనే నాలుగు గ్రూపుల్లో 26మంది క్రికెటర్లకు బీసీసీఐ రిటైనర్ షిప్ ఇచ్చింది. ఇందులోభాగంగా ఈసారి సంజూ శాంసన్ తొలిసారి బీసీసీఐ కాంట్రాక్టు కిందకు రావడంతో అతడిని సీ కేటగిరీలోకి చేర్చారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాల గైర్హాజరీలో భారత టీ20 కెప్టెన్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న అక్షర్ పటేల్ బి నుండి ఎకి ప్రమోట్ అయ్యాడు.
సంజు శాంసన్‌కు జాక్‌పాట్ లభించింది
IPL 2022లో తన కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ జట్టును రన్నరప్‌గా నిలిపిన సంజూ శాంసన్, టీమ్ ఇండియాలో, వెలుపల కొనసాగుతున్నాడు. తరచుగా సోషల్ మీడియాలో వీరిని చేర్చాలనే డిమాండ్ ఉంది. గత ఏడాది కాలంలో వన్డే క్రికెట్, టీ20ల్లో పలు సందర్భాల్లో తానేంటో నిరూపించుకున్నాడు. అదే ఫలితం ఏమిటంటే.. తొలిసారిగా ఈ జాబితాలో చోటు సంపాదించాడు. ODIలలో, సంజు 11 మ్యాచ్‌లలో 10 ఇన్నింగ్స్‌లలో 66 సగటుతో 330 పరుగులు చేశాడు. అతని పేరు మీద 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో, 17 T20 ఇంటర్నేషనల్స్‌లో, అతను టీమ్ ఇండియా కోసం 20 సగటుతో 301 పరుగులు చేశాడు, ఇందులో అర్ధ సెంచరీ. స్ట్రైక్ రేట్ 134 ఉంది.
A+ కేటగిరీ (7 కోట్లు) : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా
ఎ కేటగిరీ (5 కోట్లు ): హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్
బి కేటగిరీ (3 కోట్లు) : శుభమాన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్
సి కేటగిరీ (1 కోటి ): ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, కెఎస్ భరత్