అరుదైన నాణేనికి 33 కోట్లు.. మహ్మద్ ప్రవక్త వారసుడి గని నుంచి  - MicTv.in - Telugu News
mictv telugu

అరుదైన నాణేనికి 33 కోట్లు.. మహ్మద్ ప్రవక్త వారసుడి గని నుంచి 

October 25, 2019

Prophet Mohammad successor rare coin 

ఇస్లాం మత స్థాపకుడు మహ్మద్ ప్రవక్త వంశంతో సంబంధమున్న అరుదైన బంగారు నాణెం రికార్డు ధరకు అమ్ముడుబోయింది. క్రీస్తు శకం 723లో ముద్రించిన ఈ నాణేన్ని రూ. 33 కోట్లకు వేలంలో అమ్మేశారు. ఉమయ్యాద్ పేరుతో వ్యవహరించే ఇలాంటి నాణేలు ప్రస్తుతం 12 మాత్రమే ఉన్నాయి. 

ప్రవక్త తర్వాత ఖాలిఫా పదవి అధిష్టించిన ఆయన వారసుడికి చెందిన గనిలోంచి వెలికి తీసిన బంగారంతో వీటిని తయారు చేశారు. మక్కా సమీపంలో ఈ గని ఉండేది. నాణేలపై ఈ వివరాలు ఉన్నాయి. పేరు వెల్లడించడానికి ఇష్టపడిన ఓ వ్యక్తి వద్ద ఇలాంటి నాణెం ఒకటుందని తెలుసుకున్న మోర్టాన్ అండ్ ఈడెన్ సంస్థ అతని కోరికమేరకు వేలం వేసింది. రూ. 14 కోట్లు పలుకుతుందని భావించగా అంతకు రెండు రెట్లకుపైగా పలికింది. కాగా, ఇప్పటి వరకు అత్యంత ఎక్కువ ధర పలికిన నాణెంగా ‘ఫ్లోయింగ్ హెయిర్ డాలర్’ రికార్డులకెక్కింది. దాన్ని ఆరేళ్ల కిందట వేలం వేయంగా రూ. 70 కోట్ల ధరకు అమ్ముడైంది.