వ్యభిచారంపై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యభిచారం నేరం కాదని, ప్రజలను సాయం కోసం అభ్యర్థించడమని తెలిపింది. ముంబైలో గతేడాది సెప్టెంబర్‌లో పోలీసులు ఓ గెస్ట్‌హౌజ్‌పై రైడ్ చేశారు. ముగ్గురు మహిళలను, బ్రోకర్‌ను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు మహిళలను పరివర్తన మార్పు అంటూ ఓ ఆశ్రమానికి తరలించారు. ఈ మహిళల తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల్ని అప్పగించాలని మజ్గావ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. వీరి విజ్ఞప్తిని మేజిస్ట్రేట్ తోసిపుచ్చారు.
దీంతో వారు బాంబే హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ చవాన్ నేతృత్వంలోని ధర్మాసనం మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పుని తోసిపుచ్చింది. మేజర్ మహిళలకు వారికి ఇష్టమైన వృత్తిని ఎంచుకునే హక్కు ఉందని తెలిపింది. ఇప్పటికే వారిని చట్ట ప్రకారం విచారించినందున ఇకపై వారి నిర్బంధాన్ని కొనసాగించాకుడదని తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ (నివారణ) చట్టం, 1956 ప్రకారం మూడు వారాల వ్యవధికి మించి బాధితులను అదుపులో ఉంచేందుకు మేజిస్ర్టేట్‌కు అధికారం లేదన్నారు. పిటిషనర్లు దుర్బుద్దితో ఇతరులకు వల వేస్తున్నట్టు గానీ లేదా వారు వేశ్యా గృహం నడుపుతున్నారు. అనడానికి గానీ ఎటువంటి ఆధారాలు లేని కారణంగా వారిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించించారు.