'ర‌ష్యా నుంచి కాపాడండి'.. స్పందించిన భార‌త్‌ - MicTv.in - Telugu News
mictv telugu

‘ర‌ష్యా నుంచి కాపాడండి’.. స్పందించిన భార‌త్‌

February 26, 2022

nhngnx

రష్యా – ఉక్రెయిన్‌ దేశాల మధ్య మూడు రోజులుగా భీకరంగా యుద్దం జరుగుతోంది. నరేంద్ర మోదీ చెబితే రష్యా అధ్యక్షుడు పుతిన్ వింటాడని ఢీల్లీలో ఉన్న ఉక్రెయిన్ రాయబారి ఇటీవలే మోదీని సహాయం కోరిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి భారతదేశం తమకు సహాయం చేయాలని ఉక్రెయిన్ కోరింది. శనివారం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబ, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. “ర‌ష్యాతో దౌత్య సంబంధాలను ఉపయోగించి, ఎలాగైనా రష్యా తమ దేశంపై చేస్తున్న దాడుల‌ను ఆపండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనుకు ఉద్దేశించిన తీర్మానానికి మద్దతు తెలపండి” అని విజ్జప్తి చేశారు.

మరోపక్క ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండడం తెలిసిందే. దీంతో దౌత్యం, చర్చలే ఏ సమస్యకైనా పరిష్కార మార్గమని కులేబకు జైశంకర్ చెప్పారు. దీంతో భారత ప్రభుత్వం సానుకులంగా స్పందించింది. సహాయాన్ని అందిస్తామని తెలిపింది. ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు సహకరిస్తున్నందుకు కులేబకు జైశంక‌ర్ ధన్యవాదాలు తెలిపారు.