Protect your skin in winter...
mictv telugu

చలికాలంలో చర్మాన్ని కాపాడుకోండిలా…

November 21, 2022

సీజన్ మారింది దాంతో పాటూ మన శరీరంలో మార్పులూ వస్తాయి. మన బాడీలో అన్నింటికన్నా బాగా ఎఫెక్ట్ అయ్యేది చర్మం. వేసవి అయినా, చలికాలం అయినా ముందు మన స్కిన్ మీదనే ప్రభావం చూపిస్తుంది. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో కేర్ తీసుకోకపోతే మన చర్మం మనకే బావుండదు.దాంతో పాటూ చర్మ సమస్యలూ వస్తాయి. ముఖ్యంగా చలికాలంలో మన స్కిన్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన స్కిన్ సాధారణంగా ఇష్టపడే ప్రోడక్ట్సే ఈ కాలంలో మనకు సూట్ అవ్వవు. మనం రోజూ వాడే మాయిశ్చరైజర్ ఇప్పుడు వాడితే అది ఇప్పుడు సూట్ అవ్వదు. హైడ్రేట్‌గా ఉండదు. ఉష్ణోగ్రతలు తగ్గడం, వాతావరణం పొడిగా ఉండడంతో చర్మం డ్రైగా, చిరాగ్గా, నిస్తేజంగా మారి ఇబ్బందిగా ఉంటుంది.గీతలు, ముడతలు ఎక్కువ అవుతాయి.

చలికాలంలో చర్మం పొడి గాలికి తేమని కోల్పోతుంది. దీనిప్రభావం ముందు పడేది మన చర్మం మీదనే. అందుకే చలికాలంలో ఎప్పుడూ మనం వాడే రెగ్యులర్ స్కిన్ కేర్ ప్రొడక్టస్ నే వాడకూడదు. గాలి వీస్తున్నప్పుడు, చలిగా ఉంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్‌ని మార్చాలి.సమ్మర్‌లో మనం ఎక్కువగా నురగ వచ్చే ఫేస్ వాష్ వాడతాం. దీని వల్ల ఫేస్ క్లీన్ అయిన ఫీల్ వస్తుంది. అయితే చలికాలంలో ఉండే పొడి కారణంగా అంత స్ట్రాంగ్ క్లెన్సర్ వాడకపోవడమే మంచిది. ప్రశాంతమైన,SLS రహిత తేలికపాటి క్లెన్సర్ వాడాలి. హార్డ్‌గా ఉండే క్లెన్సర్ చర్మంలోని సహజ నూనె, తేమని దూరం చేస్తాయి. చలికాలంలో చర్మానికి సాధారణం కంటే ఎక్కువ తేమ అవసరం కాబట్టి దానికి తగ్గట్టు తేలికైన క్లెనస్ర్ ను వాడాలి.

అలాగే చలికాలంలో మాయిశ్చరైజర్‌కి ముందు టోనర్ వాడడం చాలా ముఖ్యం. ఎందుకంటే, చలికాలంలో, హ్యూమెక్టెంట్లు (హైడ్రేషన్స్), ఎమోలియెంట్లు(మాయిశ్చరైజర్స్) రెండూ అవసరం. డ్రై స్కిన్‌పై మాయిశ్చరైజర్‌ని రాయడం అనేది చాలా ముఖ్యం.టోనర్‌లో హ్యూమెక్టెంట్స్ ఉంటాయి. అవి స్కిన్‌కి అవసరమయ్యే నీటిని అందిస్తాయి. మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల హైడ్రేషన్‌‌ అందుతుంది. చర్మాన్ని ప్యాంపర్‌గా ఉంచుతుంది. టోనర్ లేకపోయినా, మాయిశ్చరైజర్ అప్లై చేసే ముందు స్కిన్ కాస్తా తడిగా ఉండేలా చూసుకోవడం మంచిది. ఇది మాయిశ్చరైజర్ ప్రభావాన్ని ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. చలికాలంలో చర్మాన్ని డ్రైగా కాకుండా చేస్తుంది.

ఇక సన్ స్క్రీన్ , దీని విషయానికి వస్తే కేవలం వేసవికాలంలోనే సన్ స్క్రీన్ వాడాలనే అపోహలో ఉంటారు చాలామంది. కానీ అది నిజం కాదు. ప్రతి రోజూ సన్‌స్క్రీన్ రాయడం మంచిది. ఇది స్కిన్ హెల్త్‌ని కాపాడి రక్షిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. దీంతో స్కిన్ యవ్వనంగా, పిగ్మంటేషన్ లేకుండా తాజాగా ఉంటుంది. చలికాలంలో ఎండ తక్కువగా ఉన్నప్పుడు మనం సన్‌స్క్రీన్ రాయం. కానీ, ఏడాది పొడవునా యూవీఏ రేడియేషన్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇవి చర్మాన్ని నిస్తేజంగా కనిపించేలా చేస్తాయి.

దీంతో పాటూ ఆరోగ్యకరమైన తిండి కూడా తినాలి. చలికాలంలో మన ఒంటకి చాలా తిళ్ళు పడవు. కాబట్టి అలాంటివి ఎవాయిడ్ చేయడమే మంచిది. ఈ కాలంలో వేడివేడిగా తినాలి. చలిగా ఉన్నప్పడు ఫ్రైడ్ పదార్ధాలు చాలా తినాలి అనిపిస్తుంది. కానీ అది మన ఆరోగ్యానికి కానీ ఒంటికి కానీ ఎంత మాత్రమూ మంచిది కాదు. మూమూలుగానే వేపుడు పదార్ధాలు మన ఆరోగ్యానికి మంచివి కావు అని చెబుతారు. ఎక్కువ మోతాదులో నూనె పదార్ధాలు తినడం వల్ల మన చర్మం పిగ్మెంటేషన్ కు గురవుతుందిట. దానివల్ల చర్మం మీద మచ్చలు రావడం, గుంతలు పడడం వటంివి జరుగుతాయి. దీంతో స్కిన్ చూడ్డానికీ బావుండదు, ఉండడానికీ బావుండదు. కాబట్టి వీలయినంత వరకూ ఫ్రైడ్ పదార్ధాలను సాధ్యమైనంత వరకూ దూరంగా ఉంచడమే మంచిది.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. స్కిన్, బాడీ కేర్ అనగానే అమ్మాయిలకు మాత్రమే అనుకుంటారు. కానీ ఇవన్నీ అమ్మాయిలకు ఎంత ముఖ్యమో అబ్బాయిలకూ అంతే ముఖ్యం. మేకప్ కు సంబంధించినవి అబ్బాయిలు ఫాలో కాకపోయినా పర్వాలేదు కానీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లాంటివి మాత్రం అబ్బాయిలు కూడా తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందే. అలాగే ఫుడ్ కూడా. చర్మం ఎవరిదైనా ఒకలానే రియాక్ట్ అవుతుంది. అబ్బాయిలు అయినంత మాత్రాన వాళ్ళ చర్మమేమీ కాలాలకి అతీతంగా ఉండదు. కాబట్టి అబ్బాయిలూ అపోహలు పక్కన పెట్టి మీరు కూడా మీ చర్మాన్ని రక్షించుకోండి.