‘పౌరసత్వ’ మంటల్లో అస్సాం.. అక్కడే నిరసనలు ఎందుకు?  - MicTv.in - Telugu News
mictv telugu

‘పౌరసత్వ’ మంటల్లో అస్సాం.. అక్కడే నిరసనలు ఎందుకు? 

December 11, 2019

Protest against.

పొరుగు దేశాల నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ తదితర మత మైనారిటీలకు పౌరసత్వం కల్పించేందుకు ఈ రోజు పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు అస్సాంలో మంటలు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. పలు చోట్ల ఆందోళనకారులు విధ్వంసానికి దిగుతున్నారు. పోలీసులకు, వారికి జరిగిన ఘర్షణల్లో పెద్దసంఖ్యలో గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేయడానికి భారత ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇంటర్నెట్‌ను నిలిపేసింది.  

బంగ్లా హిందువులు వస్తారని..

ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో లేని పరిస్థితి అస్సాంలో నెలకొంది. అరుణాచలప్రదేశ్‌, నాగాలాండ్‌, మిజోరంలలో ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ ఉండటంతో అక్కడికి వలసదారులు, మన దేశంలోని ఇతర రాష్ట్రాల పౌరులు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలి. పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన ముస్లిమేతరులు అక్కడ స్థిరపడే అవకాశం లేదు. అయితే అస్సాంలో ఈ పర్మిట్ విధానం లేకపోవడంతో పెద్ద సంఖ్యలో స్థానికేతరులు వచ్చేస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, మయన్మార్‌ల నుంచి వేల మంది తరలి వస్తున్నారు. వారికి భారత పౌరసత్వం ఇస్తే తమ హక్కులు దెబ్బతింటాయని అస్సామీలు ఆందోళన పడుతున్నారు. ఈ భయంతోనే మణిపూర్ జనం ఆందోళనకు దిగగా, ఆ రాష్ట్రాన్ని రాష్ర్టపతి ఉత్తర్వు ద్వారా ఈ రోజు ఇన్నర్ లైన్ పర్మిట్ పరిధిలోకి తీసుకొచ్చారు. 

అస్సాంకు బంగ్లాదేశ్ నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి దశాబ్దాలుగా లక్షలాది మంది వలస వచ్చారు. 19 లక్షలమంది అక్రమంగా నివసిస్తున్నట్లు గణాంకుల చెబుతున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లుతో బంగ్లా నుంచి మరికొన్ని లక్షల మంది వస్తారని అస్సామీలు భయపడుతున్నారు. వలసల వల్ల అస్సామీ సంస్కృతి, భాషలకు ముప్పు కలుగుతోందంని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అస్సామీ మాట్లాడేవారు  1991లో 58 శాతం కాగా, 2001 అది 48 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ఆధిపత్యం పెరుగుతోంది. అందుకే, పౌరసత్వ బిల్లు నుంచి అస్సాంను మినహాయించాని కోరుతున్నారు. అయితే వారి ఆందోళనలు అర్థరహితమని కేంద్రం చెబుతోంది. కొత్త చట్టం ప్రకారం.. 2014 డిసెంబరు ముందు వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం వస్తుందని, ఆ తర్వాత వచ్చిన వారికి ఇవ్వరు కనుక భయపడాల్సిన అవసరం లేదంటోంది.