గౌరి హత్యపై నిరసన - MicTv.in - Telugu News
mictv telugu

గౌరి హత్యపై నిరసన

September 6, 2017

కర్ణాటకకు చెందిన మహిళా జర్నలిస్టు గౌరి లంకేష్ హత్యపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. బుధవారం హైదరాబాద్ లో పాత్రికేయులు నిరసన తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వివిధ పాత్రికేయ సంఘాలు, ప్రజా సంఘాలు సమావేశమై ఈ హత్యను తీవ్రంగా ఖండించాయి. దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. దేశంలో భావప్రకట స్వేచ్ఛపై దాడి జరుగుతోందని, మతోన్మాదుల దురాగతాలకు అడ్డుకట్టవేయాలని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. నిరసనలో సీనియర్ పాత్రికేయులు ఎన్. వేణుగోపాల్, ఎన్.వీ. రమణ, వి.సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.