బిగ్ బాస్‌పై రచ్చ.. ఢిల్లీలో గాయత్రి, శ్వేత ధర్నా - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్ బాస్‌పై రచ్చ.. ఢిల్లీలో గాయత్రి, శ్వేత ధర్నా

July 19, 2019

reality show big boss.

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ 3వ సీజన్‌పై వివాదం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వీధులకెక్కింది. షో పోరుతో అమ్మాయిలపై లైంగిక వేధింపులకు, అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న నటి గాయత్రీ గుప్తా, యాంకర్ శ్వేతారెడ్డి, దర్శక నిర్మాత కేతిరెడ్డ జగదీశ్వర్ రెడ్డి ఈ రోజు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు.  షోను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. రెడ్డి మాట్లాడుతూ.. ఈ షో పద్ధతులు నచ్చకే  శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా బయటికి వచ్చారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాగార్జున షో నుంచి తప్పుకోవాలని కోరారు. షో పార్టిసిపెంట్ల ఎన్నికలో అక్రమాలు జరుగుతున్నాయని గాయత్రి ఆరోపించారు. షోకు ఎన్నికైనట్లు చెప్పడంతో తాను ఎన్నో సినిమాలు కూడా వదలుకున్నానని, చివరకు తనను జాబితాలోంచి తీసేశారని వాపోయారు. కేసును విచారిస్తున్న తెంగాణ హైకోర్టు షో నిర్వాహకులను అరెస్ట్ చేయొద్దని ఆదేశించడం తెలిసిందే.