Protesters take 'WWE battle' to Sri Lankan PM's Bed | Video
mictv telugu

ప్రధానమంత్రి మంచంపై పడి కొట్టుకున్నారు.. వీడియో

July 11, 2022

శ్రీలంకలో ముదిరిన ఆర్ధిక సంక్షోభం తీవ్ర ఆందోళనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలంటూ వారి భవనాలను కూడా ముట్టడించారు. ఆ భవనాల్లో ఆందోళనకారులు చేసిన రచ్చ..సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అధ్యక్షుడి భవనంలోని స్విమ్మింగ్‌పూల్లో దూకి ఈత కొట్టారు. కిచెన్‌లో వండుకుని తిన్నారు. బెడ్‌రూంలలో హాయిగా సేదతీరారు. జిమ్‌లో వర్కౌట్లు చేశారు. తాజాగా ఇప్పుడు ప్రధాని అధికారిక నివాసంలోకి ప్రవేశించిన నిరసనకారులు ఆయన మంచంపై సరదాగా రెజ్లింగ్ చేశారు. ప్రొఫెషనల్ రెజ్లర్లను తలపించేలా స్టంట్లతో రెచ్చిపోయారు. అంతేకాదు ఈ వీడియోను కాస్త ఎడిట్ చేసి దానికి బ్యాగ్రౌండ్లో నిజమైన రెజ్లింగ్ మ్యాచ్ కామెంటరీని కూడా జోడించారు.

ఇందుకు సంబందించిన వీడియోను ఓ శ్రీలంక యూజర్ ఆదివారం ట్విట్టర్‍లో షేర్ చేశాడు. వీడియోలో కొందరు ఆందోళనకారులు ప్రొఫెషనల్ రెజ్లర్లను తలపిస్తూ.. మంచంపై ‘కుమ్మేసుకున్నారు’. వీడియోలో ఓ ఆందోళనకారుడు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌ రెజ్లర్‌ ర్యాండీ ఆర్టన్‌లా పోజులివ్వడం ఆకట్టుకుంది. ఇక లంకేయుల ఆందోళనల నేపథ్యంలో జులై 13న రాజీనామా చేయనున్నట్లు ప్రధాని రణిల్ విక్రమసింఘేకు తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. మరోపక్క శ్రీలంకు భారత్ బలగాలు పంపనుందనే వార్తలను ఎంబసీ ఆఫ్ ఇండియా తోసిపుచ్చింది.