డిప్యూటీ సీఎం ఇంటికి నిప్పు.. దేశమంతా పాకుతున్న నిరసనలు - MicTv.in - Telugu News
mictv telugu

డిప్యూటీ సీఎం ఇంటికి నిప్పు.. దేశమంతా పాకుతున్న నిరసనలు

June 17, 2022

‘అగ్నిపథ్’ పథకంపై పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్ మెంట్ చేపట్టాలని పెద్ద ఎత్తున యువత రోడ్డెక్కింది. పలు చోట్ల నిరుద్యోగుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. బిహార్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో పలు ట్రైన్లకు నిప్పంటించారు.

అగ్నిపథ్ నిరసన ఆందోళనలు తొలుత ప్రారంభమైన బిహార్‌లోనే రైళ్ల దగ్దం జరిగాయి.ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రేణు దేవి ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోనూ నిరసనలు జోరుగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయమే బల్లియా రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టిన ఆందోళనకారులు ఓ రైలుకి నిప్పంటించారు. రైల్వే స్టేషన్ ఆస్థులను ధ్వంసం చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, హర్యానాల్లోనూ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో 25 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు పోలీసులు.