Home > Featured > ’గర్భస్రావం’తో అట్టుడుకుతున్న అమెరికా.. రోడ్లపైకి వచ్చేశారు..

’గర్భస్రావం’తో అట్టుడుకుతున్న అమెరికా.. రోడ్లపైకి వచ్చేశారు..

గర్భస్రావం చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. యాభై ఏళ్ల నాటి చట్టాలను రద్దు చేస్తూ, ఈ అంశంపై అంతిమ నిర్ణయం ప్రజా ప్రతినిధులదేనని స్పష్టం చేసింది. తీర్పుపై అమెరికన్లు మండిపడుతున్నారు. అన్ని నగరాల్లో భారీ నిరసనలు సాగుతున్నాయి. తీర్పుతో లక్షలమంది అమెరికన్ మహిళల ప్రాణాలకు హాని జరుగుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘నా శరీరం, నా ఇష్టం’ అంటూ ప్లకార్డు పట్టుకుని తిరుగుతున్నారు. దేశంలోని సగం రాష్ట్రాలు ప్రజల డిమాండు మేరకు గర్భస్రావాన్ని చట్టబద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎందుకు రద్దు?
అబార్షన్‌ను చట్టబద్ధత కల్పించే 1973 నాటి ‘రోయ్‌ వర్సెస్ వేడ్‌’ కోర్టు తీర్పు దుర్వినియోగం అవుతోందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడి గర్భస్రావాల వల్ల మహిళల ఆరోగ్యం దెబ్బతింటోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు పాత తీర్పును పరిశీలించి, ర్భాన్ని తీసేసుకునే హక్కు రాజ్యాంగం ఇవ్వలేదని ప్రకటించింది.
ముక్తకంఠంతో నిరసన..

కోర్టు తీర్పును రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలు, మహిళా సంఘలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. ఇది విచారకర దినమని దేశాధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ దేశాధ్యక్షుడు బరాక్‌ ఒబాబా ఆవేదన వ్యక్తం శారు. కోర్టులు ప్రజల వ్యక్తిగత నిర్ణయాలపై జోక్యం చేసుకోకూదన్నారు. ఐక్యరాజ్యసమితి కూడా తీర్పుపై ఆందోళన వ్యక్తం చేసింది.

Updated : 25 Jun 2022 2:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top