రాజధాని రగడ.. విజయవాడలో పోలీసుల ఆంక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

రాజధాని రగడ.. విజయవాడలో పోలీసుల ఆంక్షలు

January 21, 2020

jkgkjh

ఏపీ రాజధానిపై అమరావతి రైతులు రగడ కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు పిలుపునిచ్చారు. రైతుల నిరసనల కారణంగా విజయవాడలో పోలీసులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నగరంలో ఎక్కడికక్కడ భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. జనాలు గుమిగూడి ఉండరాదని పోలీసులు పేర్కొంటున్నారు. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. 

మూడు రాజధానులపై ఏపీ శాసన సభ ఆమోదం తెలపగా నేడు మండలికి బిల్లు చేరింది. దీనిపై చర్చ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రకాశం బ్యారేజి, బెంజ్ సర్కిల్, ధర్నాచౌక్‌తో పాటు, తాడేపల్లి, ఉండవల్లి వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రకాశం నుంచి విజయవాడకి కేవలం ఆర్టీసీ బస్సులకు మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంతంలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన నిరసన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బలగాలను మోహరించారు.