పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. పాక్ విధానాలను ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతి రేకిస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీరులోని ముజఫరాబాద్, గిల్గిత్, కోట్లి సహా వివిధ ప్రాంతాల్లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. లోడ్ షెడ్డింగ్, చట్టవిరుద్ధ భూ ఆక్రమణలు, సహజ వనరుల దోపిడీ వంటి అంశాలపై వీరు పోరాడుతున్నారు. తమను భారత్‌లో కలిపివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కార్గిల్ రోడ్డును తెరచి, భారత దేశంలోని లడఖ్‌లో ఉన్న తమ తోటి బాల్టిస్‌లతో తమను కలపాలని డిమాండ్ చేస్తున్నట్లు తాజాగా విడుదలైన ఓ వీడియోలో కనిపించింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు మాజీ ప్రధాన మంత్రి రజ ఫరూఖ్ హైదర్ కూడా ఆందోళనలకు మద్దతు పలికారు. పాక్ ఆక్రమణ నేపథ్యంలో తాము స్వేచ్ఛా స్వాతంత్ర్యం కోరుతున్నామని, తమకు విముక్తి ప్రసాదించాలని వేలాదిమంది నినదిస్తున్నారు. ప్రజల తిరుగుబాటును అణచి వేయడానికి పాకిస్థాన్ ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతోంది.
Gilgit Baltistan protests against their oppressors.pic.twitter.com/EpzieUPpzN
— مہروز (@DazzlinMehroz) January 9, 2023
Ppl in #GilgitBaltistan chant slogans for REUNIFICATION with #Ladakh & demand opening of #Kargil – #Skardu road. Ppl always resisted #Pakistani moves to make #POJK a province of #Pakistan, but #India has always accommodated Pakistan on #JammuAndKashmir ignoring public sentiments. pic.twitter.com/a5x66Qf1nx
— Prof. Sajjad Raja (@NEP_JKGBL) January 7, 2023