ఓ మంత్రి.. ఓ ఎమ్మెల్యే.. గొడవేంటి? - MicTv.in - Telugu News
mictv telugu

ఓ మంత్రి.. ఓ ఎమ్మెల్యే.. గొడవేంటి?

October 11, 2017

మన ప్రజాప్రతినిధులు.. ప్రజలకు మేలు చేసే పనుల్లో చొరవచూపడంకంటే గౌరవ సత్కారాలు, ప్రొటోకాల్ రాచమర్యాదలకే ఎక్కువ ప్రాధన్యమిస్తున్నారు. వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా పబ్లిగా బండబూతులు తిట్టుకుంటున్నారు.. దారుణంగా కొట్టుకుంటున్నారు. చూసే జనానికి చీదర పుట్టిస్తున్నారు. వీళ్ల వీరంగాల వల్ల జరగాల్సిన కార్యక్రమాలు రసాభాస అవుతున్నాయి. ఇక ఈ నేతలు వేర్వేరు పార్టీలకు చెందిన వారయితే రగడ మరింత రంజుగా సాగుతుంది. తాజాగా బుధవారం గద్వాలలో ఇలాంటి కీచులాటే జరిగింది. అలంపుర్  కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గద్వాలో కొత్త కలెక్టరేట్ శంకుస్థాపన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వీరు గొడవ పడ్డారు. తనకు ప్రొటోకాల్ విషయంలో తనను అగౌరవిచారని సంపత్ మండిపడ్డారు. ఆయన వాదనను మంత్రి పెద్దగా పట్టించుకోలేదు. ఈ వాగ్వాదం వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత డీకే అరుణ కూడా పాల్గొన్నారు.