హైదరాబాద్‌లో ప్రపంచంలోనే పెద్ద వన్‌ప్లస్ స్టోర్… - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే పెద్ద వన్‌ప్లస్ స్టోర్…

May 15, 2019

వన్‌ప్లస్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ బ్రాండ్ వన్‌ప్లస్ అతిపెద్ద స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. నిన్న బెంగళూరులో రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రొ ను అవిష్కరించింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. దాంతోపాటు ముంబై, పుణేలలో కూడా రెండు ఎక్స్ పీరియన్స్ స్టోర్లను ప్రారంభించినట్లు ప్రకటించింది.

వన్‌ప్లస్ స్టోర్‌ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌లో 16వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అరంతస్థుల భవనం నిర్మిస్తున్నామని సీఈవో పీట్ లౌ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి అందులో స్టోర్‌ను ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభించినట్లు తెలిపారు.