రాష్ట్రపతికి దళిత టాపర్ షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రపతికి దళిత టాపర్ షాక్

December 15, 2017

దేశంలో దళితులపై రోజురోజుకూ దాడులు, వివక్ష పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. వీటిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా రామేంద్ర నరేశ్ అనే ఎంసీసీ టాపర్ విద్యార్థి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. తాను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నుంచి గోల్డ్ మెడల్ తీసుకోనని స్పష్టం చేశాడు. దేశంలో దళితులపై సాగుతున్న దాడులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నాన చెప్పాడు.బాబాసాహేబ్ భీంరావ్ అంబేడ్కర్ వర్సిటీలో నరేశ్ చదువుకున్నా. ఈ రోజు వర్సిటీలో జరిగే స్నాతకోత్సవంలో ఆయన రాష్ట్రపతి నుంచి గోల్డ్ మెడల్ అందుకోవాల్సి ఉంది. దళితులపై ఇన్ని దాడులు సాగుతున్నా ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదని, తాను ప్రభుత్వ ప్రతినిధి అయిన రాంనాథ్ నుంచ మెడల్ తీసుకోవడం సమజంసం కాదని నరేశ్ చెప్పారు. ‘దళిత సోదరులకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నాను. దళితులను ఇతర వర్గాల ప్రజలతో సమానంగా చూస్తామని రాష్ట్రపతి, ప్రధానమంత్రి హామీ ఇస్తేనే మెడల్ తీసుకుంటాను’ అని చెప్పారు.