రెండున్నర గంటల సినిమా అంటేనే బోర్ అంటున్నారు ఇప్పుడు ప్రేక్షకులు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలను తప్ప మరే పెద్ద సినిమాలను యాక్సెప్ట్ చేయడం లేదు. అలాంటి టైమ్ లో దాదాపు నాలుగు గంటల సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానంటూ దర్శకుడు మణిరత్నం భీష్మించుకు కూర్చోవడం ప్రస్తుతం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ 1 సినిమా మొదటి పార్ట్ సో సో గా ఆడింది. తమిళనాడులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగు, ఇతర భాషల్లో ఆశించిన సక్సెస్ ని దక్కించుకోలేక పోయింది. ఇప్పడు ఈ సినిమా పార్ట్ విడుదల కు సిద్ధమైంది. పొన్నియన్ సెల్వన్ 2 కూడా కచ్చితంగా తమిళనాట మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. అయితే ఇతర భాషల్లో మాత్రం ఇప్పటి వరకు మినిమం బజ్ కూడా క్రియేట్ అవడం లేదు. విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్ది సినిమా ప్రమోషన్ కార్యక్రమాల హడావుడి పెంచాల్సిన మణిరత్నం ఇంకా ఎడిటింగ్ విషయంలోనే గందరగోళానికి గురవుతున్నట్లు తెలుస్తోంది.
తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మూడు గంటల 53 నిమిషాల ఫైనల్ కట్ వచ్చిందట. ఇంత పెద్ద సినిమా తమిళనాడులో విడుదల చేస్తే ఏమో కానీ ఇతర భాషల్లో విడుదల చేస్తే మాత్రం ఖచ్చితంగా నీకో దండం.. నీ సినిమాకో దండం అంటూ ప్రేక్షకులు కనీసం థియేటర్ వైపు కూడా చూసే అవకాశం లేదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏ బాసలో అయినా సరే ఈ సినిమా మూడు గంటల 53 నిమిషాలను విడుదల చేయాల్సిందే అనే పట్టుదలతో మణిరత్నం ఉన్నాడట. ఈ మధ్యకాలంలో మూడు గంటలు దాటిన సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. అయినా కూడా ఈ సినిమాను అంతటి నిడివితో విడుదల చేయాలనుకుంటే మాత్రం ఆయన పెద్ద రిస్క్ తీసుకోవాల్సిందే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.