అధిక బరువుతో ఫెయిల్ - MicTv.in - Telugu News
mictv telugu

అధిక బరువుతో ఫెయిల్

September 2, 2017

గురువారం ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ రాకెట్ వైఫల్యానికి కారణాలు వెలుగు చూస్తున్నాయి. ఐఆర్ఎన్ఎస్ 1హెచ్ ఉపగ్రహాన్ని తీసుకెళ్లిన ఈ రాకెట్ లో ఒక టన్ను బరువువైన పరికరాలను అదనంగా తీసుకెళ్లడం వల్లే ప్రయోగం విఫలమైందని సమాచారం. ఫలితంగా రాకెట్ వేగం ఒక సెకనుకు కిలోమీటరు తగ్గిందని ఈ విషయం తెలిసిన విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. అధిక బరువు వల్ల రాకెట్ నిర్దేషిత కక్ష్యలోకి వెళ్లలేకపోయిందని, వేగం తగ్గడంతో అనుకున్న సమయానికి ఉష్ణ కవచం(హీట్ షీల్డ్) నుంచి శాటిలైట్ బయటికి రాలేకపోయిందని వెల్లడించాయి. ‘ఈ రాకెట్ అనుమతించిన బరువుకంటే ఒక టన్ను ఎక్కువ బరువును తీసుకెళ్లింది. అందుకే హీట్ షీల్డ్ తెరుచుకోలేదు. సెకనుకు 9.5 కి.మీ ప్రయాణించాల్సిన రాకెట్ అధిక బరువు వల్ల 8.5 కి.మీనే ప్రయాణించింది’ అని ఇస్రో శాటిలైట్ సెంటర్ మాజీ  డైరెక్టర్ ఎస్. కే. శివకుమార్ తెలిపారు.