కాల్చి చంపేశాడు.. ఏపీలో ప్రేమోన్మాది ఘాతుకం - MicTv.in - Telugu News
mictv telugu

కాల్చి చంపేశాడు.. ఏపీలో ప్రేమోన్మాది ఘాతుకం

May 9, 2022

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాడిపత్రిలో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తమ ప్రేమను అమ్మాయి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదనే కోపంతో కావ్య అనే యువతిపై సురేష్ అనే యువకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆపై తాను కూడా అదే తుపాకి తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న సురేశ్, కావ్యలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా వీరిద్దరూ ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తన బంధువుల ద్వారా కావ్య తల్లిదండ్రులతో పెళ్లి సంప్రదింపులు జరిపారు. అందుకు వారు ఒప్పుకోలేదు.

దీంతో కావ్యపై అక్కసు పెంచుకున్న సురేష్ రెడ్డి.. సోమవారం పక్కా ప్లాన్ ప్రకారం ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆపై తానూ తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొనఊపిరితో ఉన్న కావ్యను స్థానికులు 108 ద్వారా నెల్లూరు ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో ఆమె మృతిచెందింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.